- Advertisement -
పారిస్: పారాలింపిక్స్‌లో భారత్ మరో పతకం సాధించింది. అథ్లెటిక్స్ విభాగంలో స్ప్రింటర్ ప్రీతి పాల్ కాంస్య పతకం గెలుచుకుంది. మహిళల 100 మీటర్ల టి35 విభాగంలో ప్రీతి మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది. అద్భుత ఆటను కనబరిచిన ప్రీతి 14.21 సెకన్లలో తన రేసును ముగించింది. ఇక చైనాకు చెందిన అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ, రజత పతకాలు గెలుచుకున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ చెందిన ప్రీతిపాల్ ఒక రైతు కుటుంబంలో జన్మించింది. పుట్టినప్పటి నుంచే ప్రీతికి శారీరక సమస్యలు ఎదురయ్యాయి. అయినా అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగింది. చివరికి పారాలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మకమైన విశ్వ క్రీడల్లో పతకం సాధించి చరిత్ర సృష్టించింది.
- Advertisement -