Saturday, December 21, 2024

రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి

- Advertisement -
- Advertisement -

 

భద్రాద్రి : లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని రేగళ్ల క్రాస్ రోడ్ వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తగూడెం పట్టణ పరిధిలోని బాబుక్యాంపుకు చెందిన నీరజ్ అతని చెల్లి మరో యువతితో కలిసి పాల్వంచ నుండి ద్విచక్ర వాహనంపై ముగ్గురు కొత్తగూడెం వైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నీరజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నీరజ్ చెల్లి, మరో యువతిని స్థానికులు హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నీరజ్ చెల్లి మృతి చెందింది. మరో యువతి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News