Thursday, January 16, 2025

అన్నచెల్లెలు ప్రాణం తీసిన అతివేగం..

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: లారీని ద్విచక్ర వాహనం అతివేగంతో వెనుక నుంచి ఢీకొట్టిన సంఘటనలో అన్నా చెల్లెలు మృతి చెందిన సంఘటన హన్మకొండ జిల్లా ఔటర్‌రింగ్ రోడ్డుపై శుక్రవారం చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే..  హసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన సుమిత్‌రెడ్డి (26), పూజారెడ్డి (22) అన్నాచెల్లెలు. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తల్లిని చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తల్లి సుజాత వారి ఇంటికి రమ్మని చెప్పడంతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి సుమిత్‌రెడ్డి పల్సర్ బైక్‌పై ఇద్దరు హన్మకొండకు బయలుదేరారు.

మార్గ మధ్యలో కరుణాపురం రాంపూర్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పై ముందు వెళ్తున్న లారీని బైక్ అతి వేగంగా వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బైక్ లారీ కిందికి వెళ్లంది. ఈ ఘటనలో అన్నా చెల్లెలు అక్కడికక్కడే మృతి చెందారు. గతంలోనే భర్త చనిపోవడం ఇప్పుడు చేతికి అంది వచ్చిన ఇద్దరు పిల్లలు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లి, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపిస్తున్న తీరు అక్కడున్న వారందరినీ కన్నీరు పెట్టించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న ధర్మసాగర్ పోలీసులు మృతదేహాలను బయటకు తీయించి వరంగల్ ఎంజీఎంకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News