Monday, December 23, 2024

కాపాడు అన్న కాపాడు అన్న… చెరువులో పడిపోయిన తమ్ముడు

- Advertisement -
- Advertisement -

Heavy flood waters in Osman Sagar and Himayat Sagar

రంగారెడ్డి: అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా అన్న కళ్ల ముందే తమ్ముడు చెరువులో పడి చనిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లక్ష్మయ్యకు ఇద్దరు కుమారులు శ్రీకాంత్(26), మల్లికార్జునులతో కలిసి అత్తాపూర్‌లోని మారుతీనగర్‌లో నివసిస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ముడు ఇంట్లో అమ్మవారిని ప్రతిష్టించుకొని నవరాత్రులు పూజలు జరిపారు. గురువారం అన్నదమ్ములు అమ్మవారిని నిమజ్జనం చేసేందుకు హిమాయత్ సాగర్ వెళ్లారు. నిమజ్జనం చేస్తుండగా శ్రీకాంత్ కాలుజారి చెరువులో పడిపోయాడు. అన్న కాపాడు కాపాడు అని కేకలు వేశాడు. కానీ అన్నకు ఈతరాకపోవడంతో పరుగున వెళ్లి అక్కడ ఉన్నవారిని సహాయం అడిగాడు. అప్పటికే శ్రీకాంత్ మునిగిపోయాడు. వెంటనే స్థానికులు నీళ్లలో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News