Wednesday, January 22, 2025

వరుసకు సోదరి… పెళ్లి చేసుకుంటానని వేధించి.. కారుతో ఢీకొట్టి

- Advertisement -
- Advertisement -

Three injured in road accident at Rangareddy

అమరావతి: వరుసకు సోదరి… ప్రేమించాడు… పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు… ఆమె నిరాకరించడంతో కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతరంపురం జిల్లాలో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమ్మవారి పేట గ్రామంలో ఓ యువతి తన తల్లితో కలిసి ఉంటుంది. తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం తల్లికి వచ్చింది. తల్లి ఉద్యోగం కళ్యాణదుర్గం బదిలీకావడంతో కుటుంబంతో పాటు అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అమ్మవారి పేట గ్రామానికి చెందిన భాస్కర్ ఆ యువతిని పలుమార్లు ప్రేమిస్తున్నానని  వేధించాడు. వరసకు సోదరిని అవుతానని వేధించొద్దని వేడుకుంది. కళ్యాణదుర్గం వచ్చిన తరువాత కూడా ఫోన్‌లో ఆమెను వేధించేవాడు. మాట్లాడుదామని సోమవారం యువతిని పిలిచాడు. ప్రేమ పెళ్లి చేసుకోవాలని ఆమెను బతిమాలాడు. అన్న వరస అవుతానని పెళ్లి చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పి తన ద్విచక్రవాహనంపై వెళ్లిపోయింది. వెంటనే అతడు కారుతో ఆమె వాహనాన్ని ఢీకొట్టాడు. గ్రామస్థులు కేకలు వేయడంతో కారులో తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కారు అతి వేగంతో వెళ్లి లారీని ఢీకొట్టిన అనంతరం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. రోడ్డు ప్రమాదంగా భాస్కర్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. యువతి తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించడంతో హత్యాయత్నం కేసు వెలుగులోకి వచ్చింది. భాస్కర్‌ను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News