Wednesday, January 22, 2025

కవలలు… వదినపై మరిది అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Brother in law raped on Sister in law

ముంబయి: ఇద్దరు అన్నదమ్ములు కవల పిల్లలు… అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటారు. అన్నకు పెళ్లి కావడంతో వదిన ముందు తన భర్తగా నటించి ఆమెపై మరిది పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన మహారాష్ట్రలోని లాతూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లాతూరు ప్రాంతంలో కవలలో పెద్దవాడిని ఓ అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఇద్దరు ఒకేలా ఉండడంతో ఆమె ఎవరో తన భర్తను గుర్తించలేకపోయింది. ఇదే అదునుగా భావించిన తమ్ముడు వదినపై పలుమార్లు అత్యాచారం చేశాడు. కొన్ని రోజుల తరువాత ఆమె తన భర్తకు చెప్పడంతో కొనసాగించలంటూ తేలికగా తీసుకున్నాడు. అత్తింటి వారు కూడా పట్టించుకోకపోవడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు అన్నదమ్ములపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని కవలలను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News