Sunday, December 29, 2024

చెల్లెల్ని వేధిస్తున్నాడని….. బావను అంతమొందించిన అన్న

- Advertisement -
- Advertisement -

మేడిపల్లి పీఎస్ పరిధిలో ఘటన

మన తెలంగాణ-బోడుప్పల్ : మధ్యానికి బానిసై తన చెల్లెలును వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని అంత మొందించిన సంఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో మంగళవారం నాడు చోటు చేసుకుంది. మేడిపల్లి సీఐ గోవర్థనగిరి తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక బీదర్ ప్రాంతానికి చెందిన జయరాజు (55)నగరంలోని మంగల్ హట్ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య ముగ్గురు కుమారులు ఇతను తరుచూ మధ్యానికి బానిసై భార్య పిల్లలను వేధింపులకు గురి చేస్తుండటంతో అతని భార్య అన్నతో జరిగిన విషయం చెప్పింది. ఇలాంటి పంచాయతీలు గతంలో కూడా చాలా సార్లు జరిగినా అతనిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో అసహనానికి గురైన జయరాం బామ్మర్తి శివానంద్ జయరాజు ను ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ వేసుకొని మంగళవారం నాడు సాయంత్రం సమయంలో జయరాజు పనిచేసే ప్రాంతానికి వస్తున్నాను.. మధ్యం తాగుదామని నమ్మబలికి ఓ కిరాయి కారు తీసుకుని జయరాజును చంపేందుకు ఓ వ్యక్తితో సూపారి మాట్లాడుకొని రాజేంద్రనగర్ అత్తాపూర్ నుంచి అతనిని కారులో ఎక్కించుకొని మధ్యలోనే మెడకు హత్య చేసి నగర శివారు ప్రాంతంలో పడేయాలని ముందుగా చేసుకున్న ప్లానింగ్ ప్రకారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్ సింగారం నిర్మానుష్య ప్రాంతంలో శవాన్ని పడేశారు.

రాత్రి పదకొండు గంటల సమయంలో అటుగా వెళుతున్న ప్రయాణికులు గమనించి ఎవరో ప్రమాదవశాత్తు పడిపోయరాని మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తి అప్పటికే మృతి చెందడంతో అతని జేబులో ఉన్న అడ్రసు ఆధారంగా కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పరిసర సిపి టివి కెమెరాల ఆధారంగా వాహనాలతో పాటు అతను పనిచేసే ట్రాన్స్ పోర్ట్ ఆఫీసులో సహా ఉద్యోగుల సమాచారం, కాల్‌లిస్ట్ ఆధారంగా అనుమానం ఉన్న శివానంద్ విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని సహకరించిన ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని సీఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News