Monday, December 23, 2024

పాముకాటుతో అన్న, చెల్లెలు మృతి

- Advertisement -
- Advertisement -

ఇంద్రవెల్లి మండలంలోని మారుతిగూడ కోలం గిరిజన గ్రామంలో విషాదం

మన తెలంగాణ/ ఇంద్రవెల్లి : పాముకాటుతో అన్న, చెల్లెలు మృతి చెందిన హృదయ విదారక ఘటన ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని నమకా గ్రామపంచాయతీ పరిధిలోని పాటగూడ (మారుతిగూడ) కోలం గిరిజన గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… కెరమెరి మండలంలోని ధనోరా గ్రామపంచాయతీ పరిధిలోని అక్షపూర్ కోలం గిరిజన గ్రామంలో ఆత్రం రాజు, కవిత బాయిలది దంపతులకు  భీంబాయి భీంరావు (14) దేవురావు దుర్గ రాము దీప (4), ఒక సంవత్సరం పాప ఉన్నారు. దంపతుల మధ్య గొడవల కారణంగా ఆత్రం రాజు సంవత్సర కాలం నుండి కుటంబాన్ని వదిలేసి తమ సొంత గ్రామమైన కెరమెరి మండలంలోని అక్షపూర్‌లోనివాసం ఉంటున్నారు. కవితబాయి ఇంద్రవెల్లి మండలంలోని మారుతి గూడ గ్రామంలో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఓ చిన్న గుడిసే వేసుకొని కూలి పనులు చేసి పిల్లలను పోషిస్తుంది. రాత్రి రెండు గంటల ప్రాంతంలో పాము కాటుకు గురైన కూతురు దీప కేకలు వేసి నిద్ర లేచింది. కాని పాము కాటు వేసి విషయం తెలియక తల్లి కవిత ఇరుగుపొరుగు వారిని పిలిచి తన కూతురుకు ఏమో అయిందని భయాందోళనకు గురైంది.

ముఖానికి నీళ్లు కొట్టారు, అప్పటికే పరిస్థితి విషమించి దీప స్పృహ కోల్పోయింది. అంతలోనే ఇంట్లో నిద్రిస్తున్న కొడుకు బీంరావు కుడి చెవికి పాము కాటు వేయగా వెంటనే భీంరావు పామును చేతిలో పట్టుకొని విసిరేసినట్లు తెలిపారు. ఇద్దరిని కూడా పాము కాటువేసిందని తెలిసిన వెంటనే గ్రామస్తులు  అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చే లోపు పరిస్థితి విషమించి కూతురు దీప ఇంట్లోనే మృతి చెందినట్లు తెలిపారు. కొడుకు భీంరావు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో పరిస్థితి విషమించి మార్గ మద్యలో మృతి చెందినట్లు తెలిపారు. చేతికొచ్చిన కొడుకు, అభం శుభంతెలియని కూతురు మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మారుతిగూడలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News