- Advertisement -
అమరావతి : కుటుంబ కలహాల కారణంగా తోడబుట్టిన అన్ననే తమ్ముడు కత్తితో నరికి చంపిన దారుణ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలిలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అత్తిలికి చెందిన అన్నదమ్ముల మధ్యం కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం మధ్యాహ్నం కూడా ఇద్దరి నడుమ గొడవ జరిగింది. అగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు అన్నను కత్తితో నరికి హతమార్చాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అత్తిలి సర్కార్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
brother stabbed Big brother to death in Attili
- Advertisement -