Sunday, December 22, 2024

సోదరి పెళ్లికి రూ. 8 కోట్లు బహుమతి.. దెబ్బకి అందరూ షాక్

- Advertisement -
- Advertisement -

నాగౌర్: కట్నం అడిగినంత ఇవ్వలేదని, తక్కువ కట్నం ఇచ్చారని వరుడు పెళ్లికి నో చెప్పిన ఘటనలు చాలానే ఉన్నాయి. చివరి నిమిషంలో వరకట్నం కారణంగా పెళ్లికొడుకు లేదా పెళ్లికొడుకు తల్లిదండ్రులు పెళ్లి రద్దు చేసుకుంటారు. ఇలా చాలా చోట్ల జరిగింది. ఇది సర్వసాధారణం. ఇందులో వింత ఏమీ లేదు. కానీ.. చెల్లి వివాహానికి అన్నయ్యలు రికార్డు స్థాయిలో కట్నం ఇవ్వడం చాలా అరుదు. ఈ సంఘటన రాజస్థాన్‌లో నాగౌర్ జిల్లాలోని ధింగ్ సారలో జరిగింది. రాజస్థాన్‌లో సోదరి వివాహానికి 8.1కోట్ల విలువైన ఆస్తులను సోదరులు కట్నంగా ఇచ్చారు.

అందులో రూ.2.21 కోట్ల నగదు, 10 ఎకరాల వ్యవసాయ భూమి, 30 లక్షల విలువైన ప్లాట్‌,1.105 కిలోల బంగారం, 14 కిలోల వెండి, పలు వాహనాలు ఉన్నాయి. దీంతో నాగౌర్ జిల్లాలో వరకట్నానికి సంబంధించిన అన్ని రికార్డులు బద్దలయ్యాయి. వివాహ వేడుక కోసం ఈ కట్నాన్ని స్థానికంగా మైరా అని పిలుస్తారు. నాగౌర్‌లో మైరా చాలా ఏళ్లుగా ఆచారంగా ఉంది. ధింగ్ సారాకు చెందిన అర్జున్ రామ్ మెహరియా, భగీరథ్ మొహరియా తన సోదరికి అతిపెద్ద మైరా ఇచ్చి, వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారని స్థానికులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News