Saturday, April 5, 2025

మణికొండలో హెరాయిన్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

brown heroin Seized in Manikonda

110 గ్రాములు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు

హైదరాబాద్: అవసరం ఉన్న వారికి హెరాయిన్ విక్రయించేందుకు తెచ్చిన 110 గ్రాములను ఎక్సైజ్ పోలీసులు మణికొండలో గురువారం పట్టుకున్నారు. ఓ వ్యక్తి హెరాయిన్ తీసుకుని వచ్చి నగరంలో విక్రయిస్తున్నాడనే సమాచారం రావడంతో శంషాబాద్ సిఐలు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మణికొండలోని ఫ్రెండ్స్ కాలనీలో మహ్మద్ అక్తర్ జమాకన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 110 గ్రాముల హెరాయిన్ లభించింది. నిందితుడు బెంగాల్‌లోని మాల్దా నుంచి హెరాయిన్ తీసుకుని వచ్చాడని విచారణలో తేలిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. నిందితుడు అక్తర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. దాడుల్లో ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఫక్రుద్దిన్, కానిస్టేబుళ్లు మల్లేష్, గణేష్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News