హైదరాబాద్: తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. పార్టీ ఆవిర్భా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ పగా మార్పు తర్వాత ఇది తొలి సర్వసభ్య సమావేశం కావడం విశేషం. ఈ సమావేశానికి బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, జడ్పీ ఛైర్మన్లు, డిసిసిబీ ఛైర్మెన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షలు హాజరయ్యారు.
Also read: కాంగ్రెస్ వారంటీ అయిపోయింది…ఇక గ్యారంటీలకు అర్థం లేదు: మోడీ
తెలంగాణ భవన్ లో సాయంత్రం వరకు ప్రతినిధుల చర్చలు జరగనున్నాయి. పలు అంశాలపై పార్టీ శ్రేణులకు సిఎం దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కెసిఆర్ ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. అక్టోబర్ 10న వరంగల్ లో నిర్వహించే భారీ సభపైనా ప్లీనరీలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆత్మయ సమ్మేళనాలతో బిఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. త్వరలో విద్యార్థి, యువజన సమ్మేళనాల నిర్వహణకు బిఆర్ఎస్ సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
Also read: భారత్‌లో కొత్తగా 9000 కొవిడ్ కేసులు