Thursday, December 19, 2024

బిఆర్‌ఎస్ ప్రమాద బీమా కుటుంబాలకు భరోసాగా

- Advertisement -
- Advertisement -
  • కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి: రాష్ట్రంలో బిఆర్‌ఎస్ సభ్యుల కుటుంబాలకు పార్టీ భరోసాగా నిలిచే కార్యక్రమాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ఏర్పాటు చేశారని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి పట్టణానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త బొర్రా వెంకటేశ్వరరావుగౌడ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వెంకటేశ్వరరావుకు బీఆర్‌ఎస్ సభ్యత్వం కలిగి ఉండడంతో పార్టీ సమూహ ప్రమాద బీమా నుంచి మంజూరైన రూ. 2 లక్షల చెక్కును సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య మృతుని భార్య లక్ష్మికి అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ బిఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడి కుటుంబానికి ‘నేనున్నా’నంటూ సీఎం కేసీఆర్ భరోసాగా నిలిచి వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. దీని వల్ల ఆ కుటుంబాలకు ఎంతో కొంత పార్టీ ద్వారా ఆర్థికసాయం అందుతుందన్నారు. అంతేగాక ఇలాంటి పథకాలు కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే అమలు కావడం ప్రజల అదృష్టమన్నారు. వీటితోపాటు రైతుబీమా పథకం రైతుల కుటుంబాలకు ఎంతో మేలు కల్పిస్తుందన్నారు. ప్రతి పథకాన్నీ రాష్ట్రంలో ప్రజల ముంగిటకు తీసుకెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని అన్నారు. బిఆర్‌ఎస్ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ కూసంపూడి మహేష్, మట్టా ప్రసాద్, స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత పఠాన్ ఆషా ఖాన్, పటాన్ లాల్, ముద్దే శ్రీనివాసరావు, అద్దంకి అనిల్, చాంద్ పాషా, మహా నాగేశ్వరావు, చింతల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News