Wednesday, January 22, 2025

మోడీ.. ఈడీ లకు బెదరం.. !!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నిజస్వరూపం ఏమిటో మహిళా ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లమైందని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. చట్టాన్ని గౌరవించి ఈడీ ముందు విచారణకు హాజరైన కవితపై అణుచిత వ్యాఖ్యలు చేయడం బండి సంజయ్, బిజెపి నాయకులు మానుకోవాలన్నారు.

ఎమ్మెల్సీ కవిత ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కమాన్ వద్ద బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.బిజెపి పార్టీకి, బండి సంజయ్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.. అనంతరం బిఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పాల సాయిరామ్ లతో కలిసి రాజనర్సు మాట్లాడారు… ఒక మహిళ ఎమ్మెల్సీ అని చూడకుండా ఇష్ట రీతిగా మాట్లాడిన బండి సంజయ్.

నీకు అక్క చెల్లెలు లేరా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ఎగసిపడుతున్న సమయంలో తెలంగాణ జాగృతి స్థాపించి మహిళలందరినీ ఏకం చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కవితపై ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదన్నారు.. మరొక్కసారి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు బండి సంజయ్ ని తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు.. అనంతరం సిద్దిపేట వన్ టౌన్ లో బండి సంజయ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News