Monday, December 23, 2024

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/అడ్డగూడూరు: మండల కేంద్రంలో భారీ బైకు ర్యాలీ నిర్వహించి అనంతరం రేపాక, ధర్మారం, గట్టుసింగారం, చిర్ర గూడూరు, కోటమర్తి, గోవిందపురం గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.. దామర్ల వీరయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మందుల సామ్యూల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ సామ్యూల్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మందుల సామ్యూల్ మాట్లాడుతూ.. తుంగతుర్తి గడ్డ కాంగ్రెస్ అడ్డ అంటూ భారీ మెజారిటీతో గేలువబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రతి గడపగడపకు చేరువేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి పాలుపంచుకున్నాని, ఈ ప్రాంతం రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. ఈ ప్రాంత మాదిగ బిడ్డను భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలని ఓటర్లను సామేలు వేడుకున్నారు. ప్రజా ఆదరణ చూసి నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని, కార్యకర్తలు కొత్త జోష్ తో ముందుకు వస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పునూతల సోమిరెడ్డి, టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలబోయిన లింగయ్య యాదవ్, మోత్కూర్ మాజీ ఎంపీపీ పైళ్ల సోమిరెడ్డి, అడ్డగూడూరు ఎంపీటీసీ గూడెపు భారతమ్మ పాండు బీసీ సెల్ మండల ఉపాధ్యక్షుడు పురుగుల మల్లేష్ యాదవ్, బండి మధు గౌడ్, పాశం సత్యనారాయణ, వల్లంబట్ల రవీందర్రావు, యూత్ కాంగ్రెస్ నాయకులు గూడెపు నాగరాజు, చుక్క యాదగిరి, నిమ్మల సంతోష్, కంభంపాటి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News