Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌లోకి భారీగా బిఆర్ఎస్ కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గాంధీభవన్ లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం భారీ చేరికలు జరిగాయి. మాజీ మంత్రి గడ్డం వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నెన్నెల, కన్నెపల్లి మండలాలకు చెందిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. కార్యకర్తలకు కండువా కప్పిన రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కర్నాటకలో కాంగ్రెస్ ను చీల్చేందుకు బిజెపి, కెసిఆర్ ప్రయత్నించారని రేవంత్ ఆరోపించారు. కర్నాటకలో బిజెపికి, రాష్ట్రంలో బిఆర్ఎస్ కు పెద్ద తేడా లేదన్నారు. కర్నాటక బిజెపిది 40శాతం కమీషన్ సర్కార్, రాష్ట్రంలో బిఆర్ఎస్ ది 30 శాతం కమీషన్ సర్కార్ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News