- Advertisement -
హైదరాబాద్: జాబ్ క్యాలెండర్ తో పాటు నిరుద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) వాయిదా తీర్మానాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఇచ్చింది. కాగా ఈ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ప్రసాద్ తిరస్కరించారు. బిఆర్ఎస్ కోరిన అంశాలపై చర్చ జరిపేందుకు స్పీకర్ నిరాకరణ తెలిపారు. దాంతో బిఆర్ఎస్ ఎంఎల్ఏలు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. ప్ల కార్డులు ప్రదర్శించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కాగా అసెంబ్లీ సమావేశం ఇంకా వాడివేడిగా జరుగుతోంది. ఆర్టీసి చర్చ సందర్భంగా బిఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేశారు.
- Advertisement -