Thursday, January 16, 2025

అభివృద్ద్ధి, సంక్షేమమే బిఆర్‌ఎస్ అజెండా

- Advertisement -
- Advertisement -
  • ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మణుగూరు: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధ్ది, సంక్షేమమే బిఆర్‌ఎస్ పార్టీ అజెండా అని, బిఆర్‌ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు సమన్వయంతో ప్రణాళికాబద్ద్ధంగా ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. బుధవారం మణుగూరు పట్టణంలోని పద్మశాలీ కళ్యాణ మండపంలో జరిగిన బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బిఆర్‌ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సిఎం కేసిఆర్‌కే దక్కుతుందని అన్నారు. సంక్షేమ పథకాలతో లబ్దిపొందిన ప్రతిఒక్కరు బిఆర్‌ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారని, రాష్ట్రంలో బిఆర్‌ఎస్ గెలుపును ఏ శక్తి ఆపలేదని దీమా వ్యక్తం చేశారు. పినపాకను అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేశామని, మరోమారు అవకాశం కల్పిస్తే పినపాక రూపురేఖలు మారుస్తానని, ప్రజల ఆశీర్వాదం, సమిష్టి కృషితో పినపాకలో గులాబీ జెండా ఎగరవేస్తామని అన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని, ఎన్నికలకు కేవలం 46 రోజులు మాత్రమే ఉందని, బూత్ ఇంచార్జ్‌లు, 100 ఓటర్ల ఇంచార్జ్‌లు కష్టపడి పనిచేసి పినపాకలో బిఆర్‌ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ సైనికులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను గడపగడపకూ ప్రచారం నిర్వహిస్తు, రాష్ట్రంలో బిఆర్‌ఎస్ గేలుపు ఆవశ్యకతపై ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతిపక్షాలకు కనిపించడంలేదా అని ప్రశ్నించారు.

రాష్ట్ర అభివృద్ధ్ది సియం కేసిఆర్‌తోనే సాధ్యమని, ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మిమోసపోవద్దని అన్నారు. బంగారు తెలంగాణ సాకారం కోసం మరోమారు బీఆర్‌ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జెడ్పీటీసి పోశం నరసింహారావు, పిఎసీఎస్ చైర్మెన్ కుర్రి నాగేశ్వరావు, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అడపా అప్పారావు, బొలిసెట్టి నవీన్, నాయకులు యాదగిరి గౌడ్, యాంపాటి సందీప్ రెడ్డి, యూషఫ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News