- Advertisement -
హైదరాబాద్: ఇఎన్‌సి మురళీధర్ రావు మాటలు వీడియోను హరీష్ రావు ప్రదర్శించారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులు, కెఆర్‌ఎంబి సంబంధిత అంశాలపై సభలో చర్చ సందర్భంగా భట్టి ప్రసంగించారు. మురళీధర్ రావు పదవీ విరమణ తీసుకున్న పదేళ్లు బిఆర్‌ఎస్ ప్రభుత్వం కొనసాగించిందని, ఇఎన్‌సి మురళీధర్ రావు బిఆర్‌ఎస్ తనకు అనుకూలంగా మాట్లాడించిందని దుయ్యబట్టారు. సభను, రాష్ట్రాన్ని హరీష్ రావు తప్పుదోవ పట్టించకూడదని హితువుపలికారు. హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని భట్టి ధ్వజమెత్తారు. ఇరిగేషన్ మంత్రిగా తాను చెబుతుంటే అటెండర్లు మాట్లాడారని చెబుతున్నారని, ఇంకా ప్రభుత్వంలో బిఆర్‌ఎస్ ఏజెంట్లు చాలామంది ఉన్నారని, సర్కారులో బిఆర్‌ఎస్ ఏజెంట్లపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని భట్టి హెచ్చరించారు.
- Advertisement -