Monday, December 23, 2024

బిఆర్‌ఎస్, బిజెపి నేతలు టచ్‌లో ఉన్నారు: మాణిక్‌రావ్ థాక్రే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణకు ఎన్నికల ఇంఛార్జీగా డికె శివకుమార్ వస్తారనేదని అవాస్తవమని రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే అన్నారు. పార్టీ బలోపేతానికి ఆయన సేవలు వినియోగించుకుంటామని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా చందనపల్లి గ్రామంలో భట్టి విక్రమార్కతో కలిసి మాట్లాడిన ఆయన బిఆర్‌ఎస్, బిజెపి నేతలు తమతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్ ప్రచార ఆర్భాటం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

బిఆర్‌ఎస్ పాలనలో అనేక అక్రమాలు, అవినీతి జరిగాయని పలుమార్లు మాట్లాడిన మోడీ, అమిత్‌షాలు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దీనికి కారణం బిజెపి, బిఆర్‌ఎస్‌లు రహస్య స్నేహితులు కావడమేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ రెవెన్యూ సంపద అందరికీ పంచాలి కానీ కొంతమంది సంపన్నులకే దక్కుతున్నదని విమర్శించారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కలలను, ప్రజల ఆకాంక్షలను బిఆర్‌ఎస్ నెరవేర్చలేదని మండిపడ్డారు. తెలంగాణ భవిష్యత్తు కోసం బిఆర్‌ఎస్ తెచ్చిన కొత్త ప్రాజెక్టులు ఏవని ప్రశ్నించారు. కొత్త విద్యాసంస్థలు, పవర్ ప్రాజెక్టులు ప్రారంభించలేదని దుయ్యబట్టారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదని, తాగునీటి కోసం గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సిఎల్‌పి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ బలోపేతానికి సహకరిస్తోందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News