Wednesday, April 16, 2025

ప్రతిష్ఠాత్మకంగా భారత్ సమ్మిట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్ సమ్మిట్ నిర్వహ ణ బాధ్యతలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా నిర్వహించేందుకు విస్త్రత ఏర్పాట్లు చేస్తోందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర పరిశ్రమ లు, ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులతో కలిసి డిప్యూటీ సిఎం భట్టి సోమవారం ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో ‘భారత్ స మ్మిట్ 2025’ మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 25, 26న భారత్ సమ్మిట్ 2025 జరుగుతోందని తెలిపారు. వివిధ దేశాల నుండి 500 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కేంద్ర ప్రభు త్వం ఈ వేడుకకు సంబంధించిన అన్ని అ నుమతులు త్వరగా మంజూరు చేయాలని ఆయన కోరారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ పేరు ప్రఖ్యాతులు నలుదిశ లా విస్తరించేందుకు అద్భుత అవకాశంగా తీసుకుని తమ ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోందని తెలిపారు. దేశ విదేశీ ప్ర తినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి అన్ని అనుమతులు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉంచవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌కు ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిణామాలపై అధ్యయనం చేసేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని తెలిపారు.

నాడు పీవీని ఇబ్బందిపెట్టినట్లే నేడు మమ్మల్నీ ఇబ్బందిపెట్టే కుట్ర: భట్టి విక్రమార్క
బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణతో తమ ఉనికి ఉండదనే భయంతోనే బీఆర్‌ఎస్, బీజేపీ ఏకమై కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. సామాజిక విప్లవానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందన్నారు. ఆయన మీడియాతో విడిగా మాట్లాడిన సమయంలో నాడు పీవీ నర్సింహారావు భూసంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నిస్తే వాటిని నేరుగా వ్యతిరేకిస్తే ప్రజలు తిరగబడతారని భయపడి కుట్రపూరితంగా జై ఆంధ్ర ఉద్యమాన్ని తీసుకువచ్చి ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్, బీజేపీలు దాడి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ రాష్ట్రంలోని బహుజనులంతా ఏకమై ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి అండగా ఉంటారన్నారు. తెలంగాణ అడవులపై మోదీ కామెంట్ గురించి మీడియా ప్రశ్నించగా తెలంగాణపై మోదీ ఎందుకు అలా మాట్లాడారో తెలియదని అన్నారు. తెలంగాణలో ఎక్కడా అడవులను నరకలేదు, జంతువులను చంపలేదని పేర్కొన్నారు. అడవులను పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యంమని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News