Monday, January 20, 2025

రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలించి ప్రజల సంక్షేమం విస్మరించాయి

- Advertisement -
- Advertisement -

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు చరమగీతం పాడాలి: ఎంపి బండి సంజయ్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రాన్ని కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు పాలించి ప్రజల సంక్షేమం పూర్తిగా విస్మరించాయని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం ఆయన ప్రజలకు బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈసందర్భంగా గత 10 ఏళ్లు బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న ప్రజా బాగోగులు మరిచి, సొంత దందాలకు తెరలేపారని విమర్శించారు. రాష్ట్రాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనీస మౌలిక వసతులు కల్పించలేదని పేర్కొన్నారు. రెండు పార్టీల్లో కుటుంబ పాలన స్పష్టంగా కనిపిస్తుందని, తమ తప్పులు బయటపడకుండా ఇతర పార్టీలను కుటుంబ పార్టీలని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు చరమగీతం పాడి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న నరేంద్ర మోడీ సారథ్యంలోని బిజెపి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదంతో మోడీ సర్కార్ మూడోసారి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. రెట్టింపు ఉత్సాహంతో మరోసారి కరీంనగర్ నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు సిద్ధమయ్యానని నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News