హైదరాబాద్: గతంతో పొలిస్తే బిఆర్‌ఎస్ పార్టీ ఆదాయం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పెరిగింది. 2022 ఆడిట్ రిపోర్టును బిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఈ రిపోర్టులో ఈ వివరాలను బిఆర్‌ఎస్ పార్టీ వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్లు, ట్రస్టుల, విరాళాల ద్వారా భారీగా ఆదాయం వచ్చినట్లు 2022 ఆడిట్ రిపోర్ట్‌లో బిఆర్‌ఎస్ తెలిపింది. ఇందులో పొందుపర్చిన వివరాల ప్రకారం… 31 మార్చి 2021 నాటికి బిఆర్‌ఎస్ ఆదాయం మొత్తం రూ.37.65 కోట్లుగా ఉండగా మార్చి 2022 నాటికి అది రూ.218.11 కోట్లకు చేరుకుంది. 2021లో ఎలక్టోరల్ బాండ్లు, ట్రస్టుల ద్వారా బిఆర్‌ఎస్‌కు ఆదాయం లేదు. కానీ ఈ ఏడాది మార్చి నాటికి ఎలక్టోరల్ బ్రాండ్ల ద్వారా రూ.153 కోట్లు. ట్రస్టుల ద్వారా రూ.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు తన ఆడిట్ రిపోర్టులో పేర్కొంది. ఇక నికర ఆదాయం, ఓపెనింగ్ బ్యాలెన్స్, జనరల్ ఫండ్ మొత్తం కలిపి బిఆర్‌ఎస్ పార్టీ తాజా ఆస్తుల విలువ రూ.480 కోట్లుగా ఉంది.
పోస్టాఫీసుల్లో డిపాజిట్ల రూపంలో రూ.253 కోట్లు
అలాగే 2021 మార్చి 31 నాటికి పోస్టాఫీసుల్లో డిపాజిట్ల రూపంలో రూ.253 కోట్లు ఉండగా, 31 మార్చి 2022 నాటికి రూ.451కోట్లకు కు పెరిగింది. 31 మార్చి 2021 నాటికి రుసుములు, చందాల ద్వారా రూ.17 కోట్లు రాగా, 31 మార్చి 2022 నాటికి వీటి ద్వారా వచ్చిన ఆదాయం రూ.8,04,74,020లుగా ఉంది. వ్యక్తిగత చందాల ద్వారా వచ్చిన ఆదాయం మార్చి 2021 నాటికి రూ.1,00,02,379లుగా ఉండగా గతేడాది మార్చి నాటికి రూ.90,00,000లుగా ఉంది. సాధారణ చందాల ద్వారా 2021 మార్చి నాటికి రూ.3 కోట్లు రాగా ఈ ఏడాది మార్చి నాటికి రూ.3.75 కోట్లు వచ్చాయి. గతేడాది మార్చి నాటికి ఇతర ఆదాయం ద్వారా రూ.16.21 కోట్లు రాగా ఈ ఏడాది మార్చి నాటికి రూ.16.12 కోట్లు వచ్చాయని ఆ రిపోర్టులో బిఆర్‌ఎస్ పార్టీ పేర్కొంది.
పెరిగిన బిఆర్‌ఎస్ ఆదాయం !
- Advertisement -
- Advertisement -
- Advertisement -