Monday, December 23, 2024

కార్యకర్తల త్యాగాల ఫలితమే కాళేశ్వరం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 22 ఏళ్ల క్రితం కుటుంబాలను వదిలి అనేక మంది గులాబీ జెండా కప్పుకున్నారని వారందరిని పార్టీ ఎప్పుడు అక్కున చేర్చుకుంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే బృహత్తర లక్ష్యంతోనే గులాబీ కండువాను నమ్ముకొని వచ్చారని ఆమె అన్నారు. మంగళవారం ఆర్మూర్ నియోజక వర్గంలోని మాక్లూర్ మండల బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పార్టీ కోసం పని చేసే వారికి ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని, పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని కవిత పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి మూడోసారి కూడ సునాయసంగా గెలుస్తారని ఆయన మీద పోటీ చేయడమంటే మైసమ్మ ముందు పొట్టెలు కట్టేసిట్టేనని చమత్కరించారు.

దేశంలో ఇప్పటి వరకు ఎవరు చేయలేనన్ని మంచి పనులు సిఎం కెసిఆర్ చేసి చూపించారని, జరిగిన అభివృద్ధిని, అందిస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఇదేమి పార్టీ అని టిఆర్‌ఎస్ పార్టీని చూసి గతంలో హేళన చేశారని, కానీ ఇప్పుడు అదే గులాబీ పార్టీ ఇంటికి మూడు పథకాలు అందించే స్థాయికి ఎదిగిందన్నారు. పది మందికి సహాయం చేశామంటే ఆరోజు రాజకీయ నాయకులకు ప్రశాంతంగా నిద్ర పడుతుందన్నారు. మీరు చేసిన త్యాగం ఇవాళ తెలంగాణలో ఇస్తున్నటువంటి ప్రతి పథకం, ఇవాళ బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు చిధించినటువంటి స్వేదం.. చెరువులో కనిపిస్తే మంచినీటి చుక్కలు, బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల త్యాగం… ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో తెలంగాణ మొత్తానికి నీటికుండలాగా తరతరాలకు ఆదుకునే ప్రాజెక్టు అని, మనది ఉట్టి రాజకీయ పార్టీ కాదని, ఎంతో కష్టంతో, కోపంతో, ఆవేదనతో, ప్రేమతో పుట్టుకొచ్చిన పార్టీ అని, ప్రజలను బాగు చేయాలని భావించిన పార్టీ మనదేనని ఆమె పేర్కొన్నారు.

గత పదేళ్ళలో దేశంలో ఎవరు చేయలేనన్ని మంచి పనులు బిఆర్‌ఎస్ పార్టీ చేసి చూపేట్టిందని స్పష్టం చేశారు. మరింత బాధ్యతగా పని చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. మనకు ఇతర రాజకీయ ఆలోచనలు లేవని, ప్రజలకు మంచి చేయాలన్నదే ఆలోచన అని స్పష్టం చేశారు. తెలంగాణ బాగుపడాలని కోరుకునే వాళ్ళమని అన్నారు. రెండు దశాబ్దాల నుంచి ప్రజల్లో ఉన్న నాయకులు ఈ మండలంలో ఉన్నారని, అనేక మంది కార్యకర్తలు, నాయకులు గులాబీ కండువాకు అంకితం అయ్యారని కొనియాడారు. తమ పార్టీ రాష్ట్రంలో విస్తరిస్తోందని, ప్రజలకు మంచి జరగాలన్నది మొదటి ఉద్దేశ్యమని, పదవులు రావడం అన్నది రెండో ఉద్దేశ్యమన్నారు.

సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని, తెలంగాణ ప్రజల ఆశయాలను, అమరవీరుల త్యాగాలను, జయశంకర్ సార్ స్పూర్తిని తీసుకొని ముందుకు వెళుతున్న పార్టీ బిఆర్‌ఎస్ పార్టీ అని ఇటువంటి పార్టీలో ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు, పదవులు వస్తాయని స్పష్టం చేశారు. లక్ష 33వేల బీడీ కార్మికులకు నిజామాబాద్ జిల్లాలో పెన్షన్ అందుతుందని, కాబట్టి ప్రత్యేకించి బీడీ కార్మికుల కోసం ఇఎస్‌ఐ ఆస్పత్రిని నిర్మించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ఆస్పత్రి నిర్మిస్తే కామారెడ్డి ప్రాంతంలో ఉన్న కార్మికులకు కూడా ఉపయోగపడుతుందన్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు నిజామాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఉంటారని, వారికి బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలన్నారు.

బిజెపి, కాంగ్రెస్‌లు ప్రజలకు చేసింది ఏమి లేదు : మంత్రి మల్లారెడ్డి
రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు చేసింది ఏమి లేదని, కేవలం బిఆర్‌ఎస్ పార్టీతోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మాక్లూర్ మండలంలో బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News