మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్ కోటాలో ఇద్దరు ఎంఎల్‌సి అభ్యర్థులను ఖరారు చేసింది. గవర్నర్ కోటా ఎంఎల్‌సి అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ప్రకటించారు. వీ రు పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్‌కు పంపిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. గవర్నర్ ఆ మోదం తెలిపితే దాసో జు శ్రవణ్, కుర్రా స త్యనారాయణ ఎంఎల్‌సిగా ప్రమాణస్వీకా రం చేయనున్నారు. దాసోజు శ్రవణ్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టిఆర్‌ఎస్‌లో నే ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలకపా త్ర పోషించారు. కాంగ్రెస్‌లో కొన్ని సంవత్సరాలు పని చేసి, అక్కడి విధానాలతో విభేదిం చి తిరిగి బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గత శా సనసభ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎగా పోటీ చేసి ఓడిపోయారు. గత కొంతకాలంగా బిఆర్‌ఎస్‌లో కీలకంగా ఉంటున్న దాసోజు శ్రవణ్‌కు గవర్నర్ కోటాలో ఎంఎల్‌సిగా ప్రతిపాదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అలాగే ఎస్‌టిలలో అల్ప సంఖ్యాలుగా ఎరుకల సామాజికవర్గానికి చట్టసభలలో ప్రాతినిధ్యం ఉండాలని భావించి ఆ సామాజిక వర్గానికి చెందిన కుర్రా సత్యనారాయణను గవర్నర్ కోటా ఎంఎల్‌సిలు ప్రతిపాదిస్తూ కేబినెట్ నిర్ణయించింది. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్ర స్థానం ప్రారంభించిన దాసోజు శ్రవణ్.. ఉద్యమ సమయంలో చిరంజీవి సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బిఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఆయన కు టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మంచి వాగ్దాటి ఉన్న ఆయనకు జాతీయ అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయిన తర్వాత పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయిందన్న అసంతృప్తితో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు. రెండు నెలలు గడిచినా ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో మళ్లీ బిఆర్‌ఎస్‌లో కండువా కప్పుకున్నారు. తాజాగా సిఎం కెసిఆర్ ఎంఎల్‌సిగా ఎంపిక చేయడంతో చట్టసభలో అడుగుపెట్టాలన్న దాసోజ్ శ్రవణ్ కల నెరవేరనుంది.
కుర్రా సత్యనారాయణ ప్రస్థానం
కుర్రా సత్యనారాయణ తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1999 నుండి 2004 వరకు సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటిచేసి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాష్ రెడ్డి చేతిలో 17,676 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. జయప్రకాష్ రెడ్డికి 71,158 ఓట్లు రాగా… సత్యనారాయణకు 53,482 ఓట్లు వచ్చాయి. తదనంతర కాలంలో బిజెపిని వీడి బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.