Monday, December 23, 2024

హస్తినలో బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మారుస్తూ అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం నుం చి ఆమోదం లభించిన తరువాత ౠమొ ట్ట మొదటిసారిగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో బిఆర్‌ఎస్ తాత్కాలిక భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పేరును మార్చినందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటుగా బి ఆర్‌ఎస్ విజయవంతం కావాలనే ఉద్దేశ్యంతో ఈ నెల 13, 14 తేదీల్లో రాజశ్యామల యాగాన్ని నిర్వహించాలని ఆ యన తలపెట్టారు. ఎన్నికలకు ముందు కూడా కెసిఆర్ తన ఫామ్‌హౌస్‌లో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఈ యాగం ముగించుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఆ ఎన్నికల్లో అద్భుత విజయాని సాధించారు.

ఫలితంగా రెండో దఫా కూడా రాష్ట్రంలో కెసిఆర్ అధికారాన్ని సాధించారు. ఇదే తరహాలో జాతీయ స్థాయిలో బిఆర్‌ఎస్‌కు ఘనవిజయం దక్కాలన్న లక్షంతోనే కెసిఆర్ రాజశ్యామల యాగాన్ని తలపెట్టారు. దీని కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాగం ఏర్పాట్లతో పాటుగా బిఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు ఆయన నేడు ఢిల్లీ వెలుతున్నారు. నేటి నుంచి నాలుగైదు రోజుల వరకు కెసిఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి రాజకీయాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా వివిధ పార్టీలకు చెందిన నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

అదే సమయంలో బిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి నేతలను కూడా కెసిఆర్ స్వయంగా ఆహ్వానించనున్నారు. కాగా 14న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మధ్యాహ్నం 12.30 నుంచి 1.00 గంటల మధ్య ప్రారంభించనున్నారు.
జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేలా…
ఇకపై కెసిఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉండనున్నాయి. ఈ మేరకు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలకు పిలుపునివ్వనున్నారు. అలాగే జాతీయ రాజకీయాల్లో బిఆర్‌ఎస్ విధి, విధానాలు ఎలా ఉండబోతున్నాయి? దేశంలో ఎలాంటి మార్పులకు శ్రీకా రం చుట్టబోతున్నాం? ఎందుకు జాతీయ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది? రాష్ట్రాల పట్ల మోడీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి? మోడీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా పతనమవుతున్న దేశ ప్రగతి, తదితర అంశాలపై కేంద్రంలోని బిజెపి సర్కార్‌ను కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఎండగట్టే విధంగా పలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు గా తెలుస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా ఒక యంత్రాం గం అప్పుడే కార్యరంగంలోకి దిగినట్లుగా సమాచారం.
ఢిల్లీలో భారీగా వెలసిన కెసిఆర్ ఫ్లెక్సీలు
బిఆర్‌ఎస్ పార్టీ మద్దతుగా దేశ రాజధానితో పాటుగా అనేక రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. తెలుగు ప్రజలు అత్యధికంగా నివసించే రాష్ట్రాల్లో ఫ్లెక్సీల జాతర మొదలైంది. ఇప్పటికే కెసిఆర్‌కు ఘన స్వాగతం పలుకుతూ ఢిల్లీ రాజధానిలో ఫ్లెక్సీలు వెలిశాయి. అలాగేఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహరాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కూడా కెసిఆర్ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. దేశం కోసం కెసిఆర్ అనే నినాదంతో వాటిని ఏర్పాటు చేశారు. కాగా నేడు కెసిఆర్ ఢిల్లీ వెలుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి మొదలుకుని పార్టీ కార్యాలయం ప్రారంభించే రహదారుల్లో కెసిఆర్ ఫ్లెక్సీలను పెద్ద సంఖ్యలో బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు అలిశెట్టి అరవింద్ ఆధ్వర్యంలోఏర్పాటు చేశారు.

అనతి కాలంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో ముందించిన తమ అభిమాన నేత కెసిఆర్… దేశాన్ని సైతం ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్న వేళ తాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతు బంధు దళిత బంధు లాంటి పథకాలకు వ్యూహరచన చేసి సమర్థవంతంగా దేశంలో అమలు చేస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. కెసిఆర్ నేతృత్వంలో బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనీ దేశవ్యాప్తంగా అమలు జరుగుతాయన్నారు. అందు కే బిఆర్‌ఎస్ పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తోందన్నరు. ఇలాంటి పథకాలను దేశంలోని రైతులందరికీ, అణగారిన వర్గాలకు అందాలంటే ఎంతో ముందు చూపు ఉన్న కెసిఆర్ నాయకత్వం అవసరమన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సంక్షేమ పథకాలను దేశ ప్రజలకు వివరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
అన్ని రాష్ట్రాల్లోనూ బిఆర్‌ఎస్ కార్యాలయాలు
వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి బిఆర్‌ఎస్‌ను అన్ని రాష్ట్రాల్లోకి విస్తరించాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని తలపెట్టారు. ఈ మేరకు పార్టీలోని పలువురు ముఖ్యనాయకులకు ఆ బాధ్యతలు సైతం అప్పగించినట్లుగా తెలుస్తోంది. కేంద్ర కార్యాలయం ప్రారంభమైన వెంటనే ముందుగా దక్షిణాది రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్ కార్యాలయాలను ఏర్పాటు చేసే అంశంపై ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా కర్నాటక రాష్ట్రానికి మరో మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో జెడిఎస్‌తో కలిసి బిఆర్‌ఎస్‌ను విస్తరించే దిశగా కెసిఆర్ వ్యూహాలకు పదనుపెడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా తెలుగు ప్రజలు అత్యధికంగా నివసించే నా లుగైదు జిల్లాల్లో బిఆర్‌ఎస్ పక్షాన అభ్యర్ధులను బరిలోకి దించే అంశంపై కూడా కెసిఆర్ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

అయితే జెడిఎస్‌తో సమగ్రంగా చర్చలు జరిపిన తరువాతనే బిఆర్‌ఎస్ పోటీపై కెసిఆర్ కీలక నిర్ణ యం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో వి నిపిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, తమిళనా డు, బిహార్, రాజస్తాన్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో కూడా పార్టీ కార్యాలయాలపై ఏర్పాటులో కూడా కెసిఆర్ శరవేగంగా పావులను కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఎపి కార్యాలయం ఏర్పాటు చేసేందుకుగాను మంత్రి తలసాని త్వరలోనేఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. అక్కడ శరవేగంగా ఆ పనులను పూర్తి చేసే బాధ్యతలను ఆయన తనకున్న అనుచవర్గానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వారు కూడా బిఆర్‌ఎస్ కార్యాలయానికి అనువుగా ఉండే భవనం కోసం వెతుకుతున్నారు. మరో నాలుగుదు రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పార్టీ పక్షాన రెండవ కార్యాలయం ఎపిలో ప్రారంభవుతుందని తెలుస్తోంది.
పలు రాష్ట్రాల నుంచి లభిస్తున్న మద్దతు
మోడీ సర్కార్‌పై నేరుగా యుద్ధం ప్రారంభించిన కెసిఆర్‌కు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన నేతలు కెసిఆర్‌కు స్వయంగా ఫోన్ చేసి బిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలుపుతున్నారు. బిఆర్‌ఎస్ తమ రాష్ట్రాల్లో విస్తరణకు సంపూర్ణంగా సహకరిస్తామని ముందుకు వస్తున్నారు. స్పష్టమైన హామీలు కూడా ఇస్తున్నారు. దీంతో కెసిఆర్ త్వరలోనే వివిధ రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్ళనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు సంబంధించిన రూట్‌మ్యాప్ కూడా సిద్ధమవుతోంది. దీని కోసం అన్ని సౌకర్యాలతో కూడిన ఒక వాహనాన్ని సిద్దం చేసే అంశంపై కూడా దృష్టి సారించినట్లుగా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే వాహనం రూపురేఖలు ఎలా ఉండాలా? అందులో సమకూర్చాల్సిన సౌకర్యాలపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

కాగా బిఆర్‌ఎస్ ఏర్పాటు అధికారిక ప్రక్రియ పూర్తి కావడంతో పార్టీలో చేరడానికి, పార్టీకి మద్దతు తెలపడానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఆసక్తి కనపరుస్తున్నారు. పార్టీ ఏర్పాటు లక్ష్యాన్ని స్పష్టంగా వివరించిన కెసిఆర్ విధానాలు నచ్చి ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రముఖ హోదాల్లో రిటైర్ అయిన వ్యక్తులు బిఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లుగా సంకేతాలు పంపారు. అయితే బిఆర్‌ఎస్‌కు అధికారికంగా ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు వచ్చిన తరువాతనే చేరికలను ప్రొత్సహించాలని కెసిఆర్ భావించారు. ప్రస్తుతం బిఆర్‌ఎస్‌కు గుర్తింపు లభించిన నేపథ్యంలో ఇక చేరికల అంశంపై ఆయన దృష్టి సారించనున్నారని తెలుస్తోంది.
ఢిల్లీ బాట పట్టిన నేతలు
14వ తేదీన ఢిల్లీలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు తరలి రానున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపి సంతోష్‌కుమార్ ఇప్పటికే శనివారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఇక సోమ, మంగళవారాల్లో బిఆర్‌ఎస్ నేతలు పెద్దఎత్తున ఢిల్లీకి చేరుకోనున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
ఈనెల 14న దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు భారత రాష్ట్ర సమితి పార్టీ (బిఆర్‌ఎస్) కేంద్ర కార్యాలయం ప్రారంభించి యాగం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రారంభోత్సవం, యాగం కోసం చేపట్టవలసిన ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా యాగం కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సిన యాగశాల స్థలంతో పాటు ఆఫీస్ భవనంలో చేపట్టవలసిన మరమ్మత్తులు, కార్యాలయ ఫర్నిచర్ ఇతర పనులను ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News