Tuesday, December 24, 2024

వి6 న్యూస్, వెలుగు దినపత్రికలను బహిష్కరించిన బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వి6 న్యూస్ ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీస్తూ, భారతీయ జనతా పార్టీకి కొమ్ముకాస్తున్న ఈ రెండింటిని బహిష్కరించాలని బిఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సదరు మీడియా సంస్థలు భారతీయ జనతా పార్టీ జేబు సంస్థగా మారి అబద్ధాలు, అసత్యాలు, కట్టుకథలతో బిఆర్‌ఎస్ పార్టీ పైన, తెలంగాణ రాష్ట్రంపైన విషం చిమ్మడమే ఏకైక ఎజెండాగా పని చేస్తున్నాయని బిఆర్‌ఎస్ పార్టీ ఆరోపించింది.

ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ మీడియా సమావేశాలకు వి6, వెలుగు మీడియా సంస్థలను అనుమతించకూడదని నిర్ణయించింది. దీంతోపాటు ఈ సంస్థలు నిర్వహించే చర్చలతో సహా, ఎలాంటి కార్యక్రమాల్లోనూ పార్టీ ప్రతినిధులెవరూ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది. బిజెపి గొంతుకగా మారి, విశ్వసనీయత కోల్పోయిన ఈ మీడియా సంస్థల అసలు స్వరూపాన్ని, ఎజెండాను తెలంగాణ ప్రజలు గ్రహించాలని బిఆర్‌ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News