Sunday, January 19, 2025

ప్రభాకర్ రెడ్డిపై దాడికి నిరసనగా దుబ్బాక బంద్.. భారీగా మొహరించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: మెదక్ బీఆర్ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనకు నిరసనగా మంగళవారం దుబ్బాకలో బీఆర్ఎస్ బంద్ కు పిలిపునిచ్చారు. బంద్ పాటించాలని దుబ్బాకలో రాత్రి బీఆర్ఎస్ నాయకులు పోస్టర్లు అంటించారు. దీంతో దుబ్బాకలో మంగళవారం ఉదయం స్వచ్ఛందంగా వర్తక, వాణిజ్య సంస్థలు, షాపులను మూసేవేశారు. బీఆర్ఎస్ బంద్ కు పిలుపునివ్వడంతో దుబ్బాకలో భారీగా పోలీసులు మొహరించారు.

కాగా, సోమవారం దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలంలోని సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన జి. రాజు(38) అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. నిందితుడు రాజు ప్రభాకర్ రెడ్డికి షేక్‌హ్యాండ్ ఇస్తానని చెప్పి ఒక్కసారిగా కత్తితో పొడిచాడు. ఊహించని పరిణామంతో తెరుకున్న ప్రభాకర్‌రెడ్డి గన్‌మెన్ నిందితుడి చేతిలో నుంచి కత్తిని లాక్కున్నాడు.

అప్పటికే ప్రభాకర్‌రెడ్డి కడుపు భాగంలో తీవ్ర గాయమైంది. ఘటన స్థలంలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, ప్రభాకర్‌రెడ్డి అనుచరులు నిందితున్ని పట్టుకొని చితకబాది పో లీసులకు అప్పగించారు. వెంటనే తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News