Monday, December 23, 2024

మూడోసారి అధికారంలోకి బీఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేప్ట్టిన అనేక అభివృద్ది , సంక్షేమం కార్యక్రమాలను చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు తమ కార్యకర్తలతో కలిసి మూకుమ్మడిగా బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్నారని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

ఆదివారం కరీంనగర్ మంత్రి మీ సేవా కార్యాలయంలో కరీంనగర్ రూరల్ మండలం ఎలాబోతారం గ్రామానికి చెందిన యువకులు పెద్దెత్తున బిఆర్‌ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి గంగుల కమలాకర్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికల వరకు ప్రజలంతా ఒక్కటై మళ్లీ బిఆర్‌ఎస్‌కు ఏకపక్ష తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

తెలంగాణలో ప్రజల మద్దతుతో బీఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు , బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్,దుప్శేడు ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు , బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News