Thursday, December 19, 2024

జాన్సన్ నాయక్ జోరు

- Advertisement -
- Advertisement -

ఖానాపూర్‌లో దూసుకుపోతున్న కారు

మనతెలంగాణ/ఖానాపూర్ : ఖానాపూర్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ అభ్యర్థి భుక్య జాన్సన్ నాయక్‌కు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈనెల 30న ఎన్నికల సమయం దగ్గర పడడంతో నియోజకవర్గంలోని ప్రజలకు ఆయన మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కపెట్టి మంత్రి కేటిఆర్ స్నేహితుడైన జాన్సన్ నాయక్‌కు గులాబి కేటాయించడంతో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తున్నారు.

టికెట్ దక్కించుకున్న జాన్సన్ నాయక్ నియోజకవర్గంగో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకవైపు ప్రచారం చేస్తూ మరోవైపు అసమ్మతి నాయకులను చేరదీస్తూ అందరిని కలుపుకొని ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలోని ఏ మండలానికి వెళ్లిన ఏ గ్రామానికి వెళ్లిన పెద్ద ఎత్తున ప్రజల ఆధరణ రావడంతో ప్రచారంలో కారు దూసుకెళ్తోంది. ఖానాపూర్ నియోజకవర్గంలో మూడోసారీ కూడా బిఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News