Saturday, November 23, 2024

బిఆర్ఎస్ అభ్యర్థుల్లో గెలుపు ధీమా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ సరళి నిశ్శబ్దంగా జరిగింది. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలలో ఓటర్లు స్పష్టమైన అవగాహనతో ఓట్లు వేసినట్లు కనిపించడంతో బిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈ ఎన్నికలలో ఓటర్లు తమ స్వీయ అనుభవంలో ఉన్న అంశాలను బేరీజు వేసుకుని ఎవరికి ఓట్లు వేయాలో ముందే నిర్ణయించుకుని ఎలాంటి అయోమ యం లేకుండా చాలా స్పష్టమైన అవగాహనతో ఓట్లు వేసినట్లు తెలిసింది. అయితే కొత్త ఓటర్లు మాత్రం చివరి వరకు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేక అయోమయానికి గురైనట్లు కనిపించింది. గ్రామాల్లో ఓట్లు వేసేందుకు ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేశారు. అదే పట్టణ ప్రాంతాలలో మాత్రం ఉదయం 10 గంటల తర్వాతనే ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వెళ్లారు.  గ్రామాలతో పోల్చితే నగరాల్లో మాత్రం అంతగా క్యూ లైన్లు కనిపించలేదు.

గ్రామీణ ఓటర్లు, పట్టణ ఓటర్లలో ఆలోచన విధానంలో స్పష్టమైన తేడా కనిపించింది. ఈ ఎన్నికలలో ఓట ర్లు చాలా వరకు తమ మనసులోని అభిప్రాయాన్ని ఎవరితో పంచుకోకుండా మౌనంగా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఓటు వేశారని అంచనా బిఆర్‌ఎస్ అభ్యర్థులు అంచనా వేసుకుంటున్నారు. ఓటర్లు పోలింగ్ బూతుకు వెళ్లే సమయంలో ఎవరికి ఓటు వేయబోతున్నారని తెలుసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎంత ప్రయత్నించినా ఓటర్ మనసులోని అభిప్రాయాన్ని తెలుసుకోలేకపోయారు. ఓటు వేసి బయటకి వచ్చిన తర్వాత కూడా ఎవరికి ఓటు వేశారో తెలియనీయకుండా నేతలను, విశ్లేషకులను ఓటర్లే అయోమయానికి గురి చేశారు. దాంతో పోలింగ్ ముగిసిన తర్వాత తాము కచ్చితంగా గెలుస్తామని చాలామంది బిఆర్‌ఎస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News