Sunday, December 22, 2024

మరో రెండు స్థానాలకు బిఆర్‌ఎస్ అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి రాగిడి లక్ష్మా రెడ్డి,
ఆదిలాబాద్ ఆత్రం సక్కు
ప్రకటించిన కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : మరో రెండు స్థానాలకు ఎంపి అభ్యర్థులను బిఆర్‌ఎస్ ప్రకటించింది. మల్కాజ్‌గిరి ఎంపి స్థానానికి రాగిడి లకా్ష్మరెడ్డి, ఆదిలాబాద్‌కు ఆత్రం సక్కు అభ్యర్థిత్వాలను పార్టీ అధినేత కెసిఆర్ ఖరారు చేశారు. దీంతో ఇ ప్పటివరకూ 11లోక్‌సభ స్థానాలకు బిఆర్‌ఎస్ అ భ్యర్థులను ప్రకటించినట్లైంది. అంతకు ముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిఆర్‌ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కెసిఆర్ గురువారం సమావేశమయ్యారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్ సభ అభ్యర్థి అంశంపై చర్చించారు. సమావేశంలో ఎంఎల్‌ఎలు కోవలక్ష్మి, అనిల్‌జాదవ్, మా జీ మంత్రులు వేణుగోపాలచారి, జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, శ్రేణులను ఎన్నికలకు సి ద్ధం చేయడంపై కెసిఆర్ దిశా నిర్దేశనం చేశారు. నేతలతో చర్చించి అభ్యర్థిని ఖరారు చేయనున్నా రు. గత లోక్ సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరఫున పో టీ చేసిన నగేష్ ఇటీవలే బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును కెసిఆర్ పరిశీలించారు. ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలే దు. లోక్ సభ టిక్కెట్ కేటాయిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News