Sunday, December 22, 2024

అనర్హత వేటెయ్యండి..స్పీకర్ కు బిఆర్ఎస్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

న్యాయస్థానాల తీర్పుల కాపీలు సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అందజేత
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని వినతి 
పార్టీ మారాలని డిఎస్‌పిలతో బెదిరింపులు
రాజ్యాంగాన్ని కాపాడతామని ఢిల్లీలో రాహుల్ ఫోజులు : బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ బి.ఫాంపై గెలుపొంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పది మంది ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. అదే విధంగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు గెలిచిన నియోజకవర్గాల్లో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారికి ప్రాధాన్యత ఇస్తూ, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. వీటిన్నింటిపై దృష్టి సారించి, పరిష్కరించాలని వారు స్పీకర్‌ను కో రారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలని, పలు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలపై మంగళవారం అసెంబ్లీలో స్పీకర్‌కు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పిటిషన్లు సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు హరీశ్‌రావు, కెటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మాధవరం కృష్ణారావు,మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కెపి వివేకానంద గౌడ్ ఉన్నారు.

బడే భాయ్ – చోటే భాయ్‌కు తేడా ఏం లేదు: కెటిఆర్
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరిన 10 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఆరుగురు ఎంఎల్‌సిలు, ఒక రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన సు ప్రీం, హైకోర్టు తీర్పుల కాపీలను స్పీకర్‌ను అందజేశామని తెలిపారు. అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసిన అనంతరం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మాధవరం కృష్ణారావు,మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కెపి వివేకానంద గౌడ్‌లతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు.

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పార్టీ ఫిరాయింపుల అంశంలో మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఉందని, ఇదే విషయాన్ని స్పీకర్‌కు గుర్తు చేశామని కెటిఆర్ తెలిపారు. ఆ తీర్పును అనుసరించి మణిపూర్‌లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎ శ్యామ్ కుమార్‌ను అక్కడి స్పీకర్ అతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల విషయంలో ఇదే పద్ధతిని అనుసరించాలని సూచించామని అన్నారు. లేదంటే స్పీకర్ పదవికి అగౌరవం వచ్చే పరిస్థితి ఉందని చెప్పామని తెలిపారు. రేవంత్ పాలనలో రాష్ట్రంలో దు ర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయని కెటిఆర్ మండిపడ్డారు. ఇద్దరు ఎంఎల్‌ఎలకు వారి నియోజకవర్గాల్లో ఉన్న డిఎస్‌పిలు ఫోన్ చేసి పార్టీ మా రండి.. లేదంటే ప్రాణగండం ఉందని బెదిరించార ని, ఇంకా కొందరిని బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు.

బిజెపిని వాషింగ్ మిషన్ పార్టీగా విమర్శించిన కాంగ్రెస్ అదే పనిని తెలంగాణలో చేస్తోందని విమర్శించారు. వేరే రాష్ట్రాల్లో బిజెపి పార్టీ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను తీసుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నారని, కానీ కాంగ్రెస్ చేస్తున్నది ఏంటని అడిగితే సమాధానం లేదని పేర్కొన్నారు. ఎంఎల్‌ఎలు పార్టీ మారకపోతే వారి సొంత ఆస్తులను ధ్వసం చేస్తున్నారని, విజిలెన్స్ దాడులతో బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. బడే భాయ్ – చోటే భాయ్‌కు తేడా ఏం లేదని, ఢిల్లీలో బడే భాయ్ నరేంద్ర మోడీ రా జ్యాంగబద్ధ సంస్థలను ఉపయోగించుకున్నట్లుగా నే, ఇక్కడ చోటే భాయ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ విభాగాలను ఉపయోగించుకుని తమ ఎంఎల్‌ఎలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఎంఎల్‌ఎలపై తమకు సానుభూతి ఉందని, ఎందుకంటే వారికి వారే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వారిని ప్రజలు తప్పకుండా శిక్షిస్తారని వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో రాహుల్ ఫోజులు
రాజ్యాంగాన్ని కాపాడుతామని కాంగ్రెస్ ఎంపి రా హుల్ గాంధీ ఢిల్లీలో ఫోజులు కొడుతున్నారు.. తెలంగాణలో కాంగ్రెస్ అదే రాజ్యాంగాన్ని తుంగ లో తొక్కేలా వ్యవహరిస్తోందంటూ కెటిఆర్ మండిపడ్డారు. ఒకవైపు రాహుల్ రాజ్యాంగం చేతి లో పట్టుకొని తాను రాజ్యాంగ సంరక్షుడిని అని పార్లమెంటులో ఫోజులు కొడుతున్నారని, బయటికి వ చ్చేమో పార్టీ ఫిరాయించిన తెలంగాణ ఎంఎల్‌ఎల కు వెన్నుతట్టి ప్రో త్సహించే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించా రు. హర్యానాలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎ కిర ణ్ చౌదరి బిజెపిలో చేరితే.. అతని సభ్యత్వం రద్దు చేయాలని కొట్లాడుతున్నారని, కర్ణాటకలో కాంగ్రె స్ ఎంఎల్‌ఎలను బిజెపి రూ. 50 కోట్లకు కొనుగో లు చేస్తుందని సిఎం సిద్ధరామయ్య చెప్పారని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడొద్దని రాహు ల్ గోవాలో కాంగ్రెస్ అభ్యర్థులతో శపథం చేయించారని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News