Wednesday, January 22, 2025

బోడుప్పల్ లో మల్లారెడ్డికి షాక్

- Advertisement -
- Advertisement -

హస్తం గూటికి బిఆర్ఎస్ కార్పొరేటర్లు
రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
మేడ్చల్ ఇక కాంగ్రెస్సే

మేడ్చల్: ఎన్నికల వేళ కారు పార్టీకి షాక్ తగిలింది. బోడుప్పల్ కార్పోరేషన్ కు చెందిన ఐదుగురు కార్పొరేటర్లు కారును విడిచి హస్తం అందుకున్నారు. గురువారం నాడు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రెష్ యాదవ్, బోడుప్పల్ అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డిల అధ్వర్యంలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వారిలో 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, ఒకటవ డివిజన్ కార్పోరేటర్ బింగి జంగయ్య యాదవ్,13వ డివిజన్ కార్పోరేటర్ దానగళ్ల అనితా యాదగిరి, 20వ డివిజన్ కార్పోరేటర్ జడిగే మహేందర్ యాదవ్, 24 వ డివిజన్ కార్పోరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్, తదితరలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News