రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్, బిజెపి పార్టీలు సమానంగా చెరో 8 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ ఎనిమిది చోట్ల విజయం సాధించగా, బిజెపి 8 స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం తన సీటును పదిలపరుచుకోగా, బిఆర్‌ఎస్ ఎక్కడా ఖాతా తెరవలేకపోయింది. ఖమ్మంలో నామ నాగేశ్వరరావు (బిఆర్‌ఎస్)పై రఘురాం రెడ్డి (కాంగ్రెస్) విజయం సాధించగా, వరంగల్‌లో ఆరూరి రమేశ్ (బిజెపి)పై కడియం కావ్య (కాంగ్రెస్) విజయ దుందుభి మోగించారు. నల్గొండలో సైదిరెడ్డి (బిజెపి)పై కుందూరు రఘువీర్ రెడ్డి (కాంగ్రెస్) గెలవగా,
మహబూబాబాద్‌లో మాలోత్ కవిత (బిఆర్‌ఎస్)పై బలరాం నాయక్ (కాంగ్రెస్) గెలుపొందారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ విజయం సాధించారు. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) జయకేతనం ఎగురవేశారు. నాగర్‌కర్నూల్‌లో మల్లు రవి (కాంగ్రెస్), పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్) విజయం సాధించారు. ఎంఐఎం పార్టీ ఒక్క స్థానంలో పోటీ చేయగా, ఆ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ వరుసగా ఐదోసారి హైదరాబాద్ ఎంపీగా విజయం సాధించారు.
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే :
నల్గొండలో కుందూరు రఘువీర్ రెడ్డి (కాంగ్రెస్)
ఖమ్మంలో రఘురాంరెడ్డి (కాంగ్రెస్)
వరంగల్‌లో కడియం కావ్య (కాంగ్రెస్)
మహబూబాబాద్‌లో బలరాం నాయక్ (కాంగ్రెస్)
జహీరాబాద్‌లో సురేశ్ షెట్కార్ (కాంగ్రెస్)
భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)
నాగర్‌కర్నూల్‌లో మల్లు రవి (కాంగ్రెస్)
పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్)
సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి (బిజెపి)
మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్ (బిజెపి)
చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (బిజెపి)
మహబూబ్‌నగర్‌లో డి.కె.అరుణ (బిజెపి)
మెదక్‌లో రఘునందన్‌రావు (బిజెపి)
కరీంనగర్‌లో బండి సంజయ్ (బిజెపి)
నిజామాబాద్‌లో అర్వింద్ (బిజెపి)
అదిలాబాద్‌లో గోడెం నగేష్ (బిజెపి)
హైదరాబాద్‌లో అసదుద్దీన్ (ఎంఐఎం)