Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ ఓటమి.. బిజెపితోనే సాధ్యం : ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా బిజెపికి మాత్రమే ఉందని ప్రజలు భావిస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ బిజెపి అగ్రనేతలు అమిత్ షా, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్‌ని కలిశాం. రాష్ట్రంలో బిజెపి సర్కార్ ఎలా తేవాలి, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లకు పైగా ఎలా గెలవాలి అని చర్చించామని వెల్లడించారు.

క్షేత్రస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నాయకులను ఎంపిక చేసుకుని పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకెళ్తున్నాం. నేను పార్టీలు మారే వ్యక్తిని కాదన్నారు.నన్ను కెసిఆర్ బయటికి వెళ్లగొట్టినప్పుడు నన్ను అక్కున చేర్చుక్క పార్టీ బిజెపి. నాకు అన్ని రకాలుగా గుర్తింపు ఇస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News