- Advertisement -
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల బృందం గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఎ కెటిఆర్ నేతృత్వంలో పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల బృందం భారీ ర్యాలీగా కాళేశ్వరం సందర్శనకు బయలుదేరి వెళ్లారు. కాళేశ్వరం చేరుకుని మొదటగా ఎల్‌డిఎం రిజర్వాయర్ సందర్శించారు. కాగా, ఈ బృందం శుక్రవారం ఉదయం 8 గంటలకు రామగుండం నుంచి బయలుదేరి 9.-30 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్ సందర్శిస్తారు. 10.30 గంటలకు మేడిగడ్డ సందర్శించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు క్యాతంపల్లిలోని చెన్నూరు మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ ఇంట్లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
- Advertisement -