Friday, January 24, 2025

శ్వేతపత్రాలకు దీటుగా బీఆర్ఎస్ డాక్యుమెంట్ విడుదల

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయబోయే శ్వేతపత్రాలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. వివిధ రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులు, అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈమేరకు బుధవారంనాడు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గత ప్రభుత్వం అవకతవకలను ఎండగట్టేందుకు సన్నాహాలు చేసింది.

Imageఇందుకు కౌంటర్ గా బీఆర్ఎస్ గత తొమ్మిదిన్నరేళ్ళలో సాధించిన ప్రగతి, సృష్టించిన ఆస్తులపై ఒక డాక్యుమెంట్ ను రిలీజ్ చేసింది. 50 స్లైడ్స్ తో ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆయా రంగాలవారీగా తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని వివరించింది. తెలంగాణా సాధించిన తర్వాత రూపాయి అప్పు చేస్తే, వెయ్యి రూపాయల ఆస్తులు సృష్టించామని, రాష్ట్రం వచ్చాక 159 శాతం ఆస్తులు పెరిగాయని ఆ డాక్యుమెంట్ లో వివరించింది. తలసరి ఆదాయం 151 శాతం పెరిగిందని పేర్కొంది. రిజిష్ట్రేషన్ల ఆదాయం 406 శాతం, పన్ను వసూళ్లు 161 శాతం, గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం 50 శాతం పెరిగాయని బీఆర్ఎస్ తన నివేదికలో పేర్కొంది.

Image

 

Image

Image

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News