ఇక్కడికి వచ్చి ఎవరైనా రాజకీయం చేయవచ్చా?
అవకాశం వస్తే అందరి కన్నా మెరుగైన పాలన అందించే శక్తి కెసిఆర్ సొంతం ఎనిమిదేళ్లలోనే రాష్ట్రాన్ని దేశానికి రోల్‌మోడల్‌గా నిలబెట్టిన
ఘనత ఆయనదే దేశాన్ని ప్రగతిపథంలో నడపడానికే బిఆర్‌ఎస్ స్థాపన మోడీ, బోడీలకు బెదిరేది లేదు చావనైనా చస్తాం కానీ మోడీకి
లొంగం మోడీపైన ఆరోపణల వెల్లువ ఆయనపైన విచారణ జరపాలి నల్లగొండ అభివృద్ధికి రూ.18వేల కోట్లు ఇస్తే పోటీ నుంచి
తప్పుకుంటాం మునుగోడు ప్రజలను అంగడి సరుకులా మార్చిన బిజెపి కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్టు రెడ్డిలు మునుగోడను ఫ్లోరోసిస్
నుంచి విముక్తం చేసిన కీర్తి టిఆర్‌ఎస్‌దే టిఆర్‌ఎస్‌వి విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎవరెవరో ఇక్కడ (తెలంగాణ)కు వచ్చి రాజకీయం చేయవచ్చుగానీ… తెలంగాణ వాళ్లు ఢిల్లీకి వెళ్లి రాజకీయ చేయకూడదా? టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు ప్ర శ్నించారు. అవకాశం వస్తే వారికంటే మెరుగైన పా లన దేశానికి అందించే శక్తి తమకుందన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సిఎం కెసిఆర్ రుజువు చేశారన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని సిఎం కెసిఆర్ కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే దేశానికి రోల్‌మోడల్‌గా నిలబెట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. రా ష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెట్టిన వారికి దేశాన్ని కూడా అ భివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో పెద్దగా ఇబ్బందులు ఉండవన్నారు.
దేశాన్ని బాగుచేయాలన్న తపన, కసి ఉండాలన్నారు. అది కెసిఆర్‌లో బోలడంత ఉందన్నా రు. ప్రధానిగా నరేంద్రమోడీ పాలనలో దేశంలో ఏ వర్గానికైనా మేలు జరిగిందా? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఆయన ధ్యాస అంతా ఎప్పుడు తన కార్పొరేట్ మిత్రులకు దేశ సంపదను ఎప్పుడెప్పుడు దోచిపెట్టాలన్నదే ఉందని విమర్శించారు. అందుకే దేశం అన్ని రంగల్లో అధోగతి పాలవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మోడల్‌ను దేశానికి పరిచయం చేయడానికి భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్)ను పెట్టామని కెటిఆర్ స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టిఆర్‌ఎస్ వి విస్తృతస్థాయి సమావేశంలో కెటిఆర్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, తెలంగాణను అభివృద్ధి చేసినట్లుగా దేశాన్ని కూ డా ప్రగతిపథంలో నడిపించాలన్న ఏకైక లక్షంతోనే కెసిఆర్ బిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశారన్నారు.
త్వరలోనే దేశానికి బిఆర్‌ఎస్ జెండా, ఎజెండాను స్పష్టం చేస్తామన్నారు. బిఆర్‌ఎస్ వచ్చినంత మాత్రం టిఆర్‌ఎస్ జెండా, ఎజెండా మారదని కెటిఆర్ స్పష్టం చేశా రు. ప్రజల ఆశీర్వాదం ఉంటే వేరే రాష్ట్రాల్లో కూడా తమ మన పార్టీ విస్తరిస్తుందన్నారు. గుజరాత్ మోడల్‌తో దేశాన్ని గోల్మాల్ చేసినప్పుడు…. బ్రహ్మాండంగా పని చేస్తూ పేదవారికి అండగా ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ…. బిఆర్‌ఎస్ ఎందుకు కావొద్దు? అని కెటిఆర్ ప్రశ్నిస్తూ మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు బిజెపి రాష్ట్ర నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌కోమో బోర్డులు, తెలంగాణ కేమో గుండ్లు, అరగుండ్లా అని కెటిఆర్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంఎల్‌ఎ గ్యాదరి కిషోర్, చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు హాజరయ్యారు.
చావనైనా చస్తాం కానీ…మోడీ బెదిరింపులకు లొంగం
ఏం చేసుకుంటారో చేసుకోండి…. మోడీ, బోడీలకు బెదిరేది లేదని కెటిఆర్ అన్నారు. చావనైనా చస్తాం….. నీకు మాత్రం లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమపై ఇడి, సిబిఐ, ఐటి దాడులు చేస్తే భయపడతారని అనుకుంటాన్నావేమో…..అది ఈ జన్మలో జరగని పని అని అన్నారు. ఇక్కడున్నది తెలంగాణ బిడ్డలం… నీ ఉడతా ఊపులకు ఎవరూ భయపడరన్నారు. కేసులకు, జైళ్లకు భయపడే వాళ్లం అయితే….పధ్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమం చేసి ఉండేవాళ్లం కాదన్నారు. మాతో పెట్టుకునేందుకు నీవు ఒక్కడు అడుగు ముందుకేస్తే….కేంద్రంతో వైరం పెట్టుకునేందుకు మూడు అడుగులు ముందుకొస్తామన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఇడి, సిబిఐ, ఐటి సంస్థలను ప్రత్యర్ధులపై మోడీ ప్రభుత్వం దాడులకు ఊసిగొలుపుతోందన్నారు. వారి వ్యూహం ఇతర రాష్ట్రాల్లో ఫలిస్తుందమోగానీ…తెలంగాణలో కాదన్నారు. తప్పు చేసిన వారే భయపడతారన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే మోడీ ప్రభుత్వం దర్యాపు సంస్థలతో దాడులు చేయిస్తారా? మోడీ పాలన చూస్తుంటే…అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందన్నారు. అయినా మోడీ ఏం చేసిన ….మా వెంట్రుక కూడా పీకలేరని కెటిఆర్ ఘాటుగా మండిపడ్డారు. మరి మోడీపై కూడా ఆరోపణలు వచ్చాయి కాదా? ఆయన ఎవరితో విచారణ జరిపించుకుంటారని ప్రశ్నించారు. శ్రీలంకలో విద్యుత్ రంగ సంస్థ అధిపతి మోడీ మీద ఆరోపణలు చేశారు. రూ 6 వేల కోట్ల విద్యుత్ కాంట్రాక్ట్ గౌతం అదానీకి ఇవ్వాలని తమపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆ దేశానికి చెందిన విద్యుత్ రంగ సంస్థ అధిపతి స్వయంగా పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. దీనిపై మోడికీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తిరిగోమన దిశగా మోడీ పాలన
అన్ని దేశాలు పురోగతి దిశగా ముందుకు సాగుతుంటే మోడీ పాలనలో భారత్ తిరోగమన దిశగా పయనిస్తోందని కెటిఆర్ విమర్శించారు. మోడీ పాలన అంటే కార్పొరేట్ సంస్థ దేశ సంపదను దోచిపెట్టడమే అన్న చందంగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి ఇప్పటి వరకు ఏ రంగం బాగుపడిన దాఖలాలు లేవన్నారు. ఒక్క కార్పొరేట్ రంగమే అభివృద్ధి చెందిందన్నారు. ఆయన చుట్టు ఉన్న ధనవంతులే మరింత ధనవంతులుగా మారారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం దేశం పేదరికంలోకి మగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కొత్త ఉద్యోగాలు…ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తుండడంతో నిరుద్యోగం పతాక స్థాయికి చేరిందన్నారు. ఇక నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయాన్నారు. కాంగ్రెస్ హయంలో నాలుగు వందల రూపాయలున్న గ్యాస్ సిలెండర్ ధర పన్నెండు వందల రూపాయలకు పెంచిన మహానుభావుడు మోడీ అని సెటైర్లు వేశారు.
మన రూపాయి విలువ ప్రపంచం ముంగిట దారుణంగా పడిపోతుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అసలు సోయే లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేవలం రాజకీయ ప్రయోజనాలే తప్ప మోడీకి దేశ ప్రయోజనాల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బిజెపియేతర ప్రభుత్వాలను కూల్చివేస్తూ మోడీ రాక్షస ఆనందం పొందుతున్నారని….అదే తన ఘనత అనుకుంటున్నారని విరుచుకుపడ్డారు. అందుకే ఎనిమిది సంవత్సరాల మోడీ పాలనలో చెప్పుకునేందుక ఏమీ లేదన్నారు. ఆయన అసమర్థ పాలన కారణంగా భారత్ పేదలున్న దేశంగా మారిందన్నారు. దేశంలో ఒక అదానీ, రాజగోపాల్ రెడ్డి ధనవంతులైతే ఈ దేశ ప్రజల భాగ్య రేఖలు మారిపోతాయా? అని ఈ సందర్భంగా కెటిఆర్ అని ప్రశ్నించారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి మాటకు కట్టుబడి ఉంటాం
బిజెపి అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టును కట్టెబట్టిన మాదిరిగానే నల్లగొండ జిల్లా అభివృద్ధికి కూడా ఆ స్థాయిలో నిధులు ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటామని మంత్రి జగదీశ్‌రెడ్డి మాటకు తాము కట్టుబడి ఉంచామని కెటిఆర్ స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్‌కు కావాల్సింది నియోజకవర్గం అభివృద్ధియేనని అన్నారు. ఒక్క సీటో, రెండో సీట్లతోనూ టిఆర్‌ఎస్ వచ్చే నష్టమే లేదన్నారు. 105 సీట్లతో సభలో ప్రజల ఆశీర్వాదంతో ఉన్నామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక కేవలం ఒక కాంట్రాక్టర్ బలుపు కారణంగానే వచ్చిందని విమర్శించారు. రూ 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి ఆయనను లోబర్చుకుని అవసరమైతే రూ 500 కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే మునుగోడు ప్రజలను అంగడి సరుకులా కొంటానని నరేంద్ర మోదీ అహంకారం ప్రదర్శించారన్నారు.
వారి అహంకారానికి…. మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోందన్నారు. ఫ్లోరోసిస్ సమస్యతో బాధపడుతున్న మునుగోడు ప్రజల కోసం రూ. 19 వేల కోట్లు ఇవ్వమంటే మోడీకి మనసు ఒప్పలేదుగానీ కాంట్రాక్టర్ రాజగోపాల్ రెడ్డికి మాత్రం రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను ఓడించడానికి కాంగ్రెస్, బిజెపిలు పరస్పరం అంగీకారం చేసుకున్నాయని కెటిఆర్ ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కాదు…ఇంకా ఎన్ని పార్టీలతో ఒప్పందలు జరిగినా, మునుగోడులో గెలిచిన ముమ్మాటికి టిఆర్‌ఎస్ పార్టీయేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మీ జోష్ చూస్తుంటే…..
టిఆర్‌ఎస్‌వి నేతల ఉత్సాహాన్ని చూస్తుంటే…… మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తామన్న విశ్వాసం కలిగిందని కెటిఆర్ అన్నారు. ఉద్యమాల్లో రాటు దేలిన నాయకులు మీరన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారన్నారు. ఆఉద్యమంలో బాగా పని చేసింది విద్యార్థి నాయకులేనని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల గురించి….. పోరాటాల గురించి తాను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ దేశంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అవగాహన పెంచుకోవాలి. ప్రజలకు వివరించాలని కేటీఆర్ సూచించారు.
వాళ్ళు కోవర్డు రెడ్డిలు
వాళ్లు కోమటిరెడ్డిలు కాదు….. కోవర్టు రెడ్డిలు అని కెటిఆర్ తనదైన శైలిలో కోమటిరెడ్డి బ్రదర్స్‌పై కెటిఆర్ తనదైశ శైలిలో పంచులు విసిరారు. వారిని మోడీ తన బుట్టలో వేసుకున్నారన్నారు. అన్న (వెంకట్‌రెడ్డి) కాంగ్రెస్ ఎంపిగా కొనసాగుతున్న ఎన్నికల సమయంలో ఆస్ట్రేలియా పోతున్నారని…. ఎలక్షన్ అయిపోయాక తిరిగి వస్తడట అని ఎద్దేవా చేశారు. ఎవరైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడు పార్టీ కోసం ప్రచారం చేయకుండా విదేశాలకు వెళ్లి విందులు చేసుకుంటారా? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఇక రాజ్‌గోపాల్‌రెడ్డేమో కాంగ్రెస్‌ను వీడి కాంట్రాక్టుల కోసం బిజెపిలోకి జొర్రిండన్నారు.వీళ్లు చేసే చిల్లర రాజకీయాన్ని మునుగోడు ప్రజలకు తెలియజెప్పాలన్నారు. గల్లిగల్లీకి… ఇంటింటికీ ఈ విషయాన్ని చెప్పాలని పార్టీ శ్రేణులకు కెటిఆర్ సూచించారు.
చంద్రబాబు..వైఎస్‌తో కొట్లాడితే గమ్మతు ఉండేది
ఇప్పుడున్న నాయకులు ఎంత చిల్లర అంటే……నవ్వాలో, ఏడవాలే కూడా తెలవడం లేదని కెటిఆర్ అన్నారు. నిజంగా కొట్లాడుదామంటే ఇది . మనకు ప్రత్యర్థులు మంచిగా ఉండేవారన్నారు. చంద్రబాబు….రాజశేఖర్ ఉండే వారితో కొట్లాడిన గమ్మత్తు ఉండేదన్నారు. వాళ్లు ఒక స్థాయి లీడర్లుకాబట్టి వారితో ఒక మాట అన్న…. ఒక మాట పడ్డ…. ఒక పద్ధతి ఉండేదన్నారు. ఇప్పుడు ఉన్న వారితో ఆగం ఉందన్నారు. ఎలాంటి బఫూన్ గాళ్లను మనకు తగిలించారంటే….. కొట్లాట చేత కాదు, మాట్లాడటం చేత కాదన్నారు. ఎంత చిల్లర రాజకీయం చేస్తున్నారంటే… కెసిఆర్ క్షుద్ర పూజలు చేస్తుండట….. నల్ల పిల్లిని ముందు పెట్టుకొని పూజ చేస్తున్నాడని కొందరు మాట్లాడుతుంటే నవ్వు వస్తోందన్నారు.
నాటి పరిస్థితులను తలచుకుంటే…
మునుగోడు నియోజకవర్గంలో ఒకప్పుడు నెలకొన్న ఫ్లోరోసిస్ పరిస్థితులను గుర్తు చేసుకుని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నాటి పరిస్థితులను చూస్తే కళ్లల్లో నీళ్లు తిరిగాయ్ అన్నారు. అప్పటి స్పీకర్ ఆదేశాల మేరకు 2010లో మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలానికి శాసనసభ్యులందరం కలిసి వెళ్లామన్నారు. అక్కడి వెళ్లి ప్రజల పరిస్థితిని చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయన్నారు. చాలా మందికి ఫ్లోరైడ్ నీళ్లు తాగి కాళ్లు చేతులు వంకర అయ్యాయన్నారు. మెడలు వంగిపోయిన దృశ్యాలను చూసి చలించిపోయామన్నారు. అందుకే కెసిఆర్ ఉద్యమ నాయకుడిగా 2006, 2007లో ఫ్లోరైడ్ రక్కసిపై పాటలు రాశారన్నారు. ఫ్లోరైడ్ రక్కసిని పారదోలేందుకు ఎంతో శ్రమించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి చౌటుప్పల్లోనే పైలాన్‌ను ఆవిష్కరించామన్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించి, ప్రస్తుతంళ ఇంటింటికీ సురక్షితమైన తాగునీరును అందిస్తున్నామన్నారు. మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్‌ను పూర్తిగా నిర్మూలించగలిగామన్నారు.