Monday, December 23, 2024

కాళేశ్వరంపై బిఆర్‌ఎస్ ఫ్యాక్ట్ షీట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం, 530 మీటర్ల ఎత్తుకు నీళ్ల ఎత్తిపోత, 240 టిఎంసిల వినియోగం..ఇదీ కాళేశ్వరం సమగ్ర స్వరూపం అని బిఆర్‌ఎస్ పార్టీ పేర్కొంది. “కాళేశ్వరంపై కాంగ్రెస్ విష ప్రచారంపై బిఆర్‌ఎస్ వాస్తవాలు” పేరిట ‘ఫ్యాక్ట్ షీట్ ఆన్ కాళేశ్వరం’ను బిఆర్‌ఎస్ విడుదల చేసింది. ఈ ఫ్యాక్ట్ షీట్‌లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీ ఇంజనీరింగ్‌కు కారణాలు, రెండు ప్రధాన విభాగాలుగా ప్రాజెక్ట్ రీ ఇంజనీరింగ్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ సవాళ్లు.. సమస్యలు, ప్రత్యామ్నాయ స్థలం ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వ ంస్థ వ్యాప్ కోస్ నిర్వహించిన సర్వే, సెంట్రల్ వాటక్ కమిషన్ లేఖ, కేంద్ర జలసంఘం సూచనలు, మహారాష్ట్ర సిఎం పృథ్విరాజ్ చవాన్ లేఖ, ఎపి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి లేఖ, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒప్పందంలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బిఆర్‌ఎస్ పొందుపరిచింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News