- Advertisement -
హైదరాబాద్: బిఆర్ఎస్ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ రైతువేదిక వద్ద రైతు సమావేశాలు నిర్వహంచాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు బిఆర్ఎస్ రైతు సమావేశాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. 3 పంటలు బిఆర్ఎస్ నినాదం- 3 గంటల కరెంట్ కాంగ్రెస్ విధానం పేరిట సభలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో తన వ్యాఖ్యలతో దుమారం రేపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవసరం లేదని పేర్కొంటూ రెడ్డి చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దారితీసింది.
- Advertisement -