Sunday, December 22, 2024

ఉచిత ఎల్‌ఆర్‌ఎస్ కోసం బిఆర్‌ఎస్ పోరాటం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల మీద తీవ్రమై న ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి హస్తం పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేస్తామని చెప్పారని, అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు మాటమార్చారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు రెండు నాల్కల ధోరణి అనుసరిస్తున్నార ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు ఫీజులు వసూ లు చేయడానికి నిరసనగా ఈ నెల 6వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు కెటిఆర్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ మో సపూరిత వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో హెచ్‌ఎండిఎ కార్యాలయం ముందు,జిహెచ్‌ఎంసి కార్యాల యం ముందు నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్న ట్లు వెల్లడించారు. అదేవిధంగా 7న కలెక్టర్లు, ఆర్‌డిఒలకు విజ్ఞాపన పత్రాలు ఇస్తామని చెప్పారు. తెలంగాణ భవన్‌లో సోమవారం కెటిఆర్ మాజీ మంత్రులు లకా్ష్మరెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లతో కలిసి మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, గతం లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేస్తామని, ప్రజల దగ్గర ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండానే రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని కెటిఆర్ అన్నారు.
గతంలో భట్టి చెప్పిన మాటలు ఒట్టి మాటలు అని అర్థమయ్యింది
గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ కోసం మార్గదర్శకాలు రూపొందించినప్పుడు, ఇదే కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడిన విషయాన్ని కెటిఆర్ వీడియోలు, అప్పటి మంత్రుల ప్రకనటలను సాక్షాలతో సహా మీడియా ముందుంచారు. అప్పటి సిఎల్‌పి నేత ఇప్పటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ..ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రజలు ఎవరు ప్రభుత్వానికి డబ్బులు కట్టవద్దని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని విమర్శించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల జేబుల నుంచి డబ్బులను దోచుకోవడానికే ఎల్‌ఆర్‌ఎస్ స్కీం అమలు చేస్తున్నారని కెటిఅర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద మార్చి 31వ తేదీ లోపల ఎల్‌ఆర్‌ఎస్ డబ్బులు కట్టాలని దరఖాస్తుదారులకు అధికారులకు నేరుగా ఫోన్ కాల్స్ చేస్తున్నారని, మరి ఇది రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగడం కాదా..? అని ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులుదారులు ఎవరూ ఫీజు కట్టవద్దని, అధికారులు ఎవరైనా డబ్బులు కట్టమని అడిగితే గతంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడిన వీడియోలను చూపించి నిలదీయాలని ప్రజలకు సూచించారు. గతంలో భట్టి చెప్పిన మాటలు ఒట్టి మాటలు అని అర్థమైందని కెటిఆర్ ఎద్దేవా చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్‌కు ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాలి
ఎల్‌ఆర్‌ఎస్ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న 25 లక్షల 44 వేలమంది లబ్ధిదారుల పైన కనీసం లక్ష రూపాయల చొప్పున భారాన్ని మోపేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైందని కెటిఆర్ అన్నారు. మొత్తం రాష్ట్ర ప్రజల నుంచి ఈ ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా 20 వేల కోట్ల రూపాయలను దోచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. అధికారంలో లేనప్పుడు ఒక తీరుగా అధికారంలో ఉన్నప్పుడు మరొక తీరుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రుల వైఖరిపై కెటిఆర్ మండిపడ్డారు.
ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగేలా ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎలాంటి చార్జీలు లేకుండా అమలు చేసేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తమ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాలకు అందరూ మద్దతు తెలపాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్ కార్యక్రమంలో ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాలని, లేకుంటే భవిష్యత్తులో న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని కెటిఆర్ హెచ్చరించారు.
నో ఎల్‌ఆర్‌ఎస్.. నో బిఆర్‌ఎస్ అన్న ఉత్తమ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు…?
ఒక ఒకప్పుడు నో ఎల్‌ఆర్‌ఎస్ -..నో బిఆర్‌ఎస్ అన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని కెటిఆర్ నిలదీశారు. ఇప్పుడు ప్రజలు నో కాంగ్రెస్ అంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అప్పుడు ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఈరోజు ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్ర ప్రజల దగ్గర ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో డబ్బులు లాక్కోవడం పైన స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదే ఎల్‌ఆర్‌ఎస్ అంశం పైన మంత్రి సీతక్క మాట్లాడుతూ డబ్బులు దోచుకోవడానికే ఎఆర్‌ఎస్ పెట్టారని అన్నారని, మరి ఈరోజు ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎస్‌పైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో న్యాయస్థానంలో కేసు వేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలవడం కోసం 420 హామీలు ఇచ్చిందని, అడ్డగోలుగా ఇచ్చిన హామీల అన్నింటిని తూ.చా తప్పకుండా అమలు చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News