Monday, April 28, 2025

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటాడుతాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చేది బిఆర్‌ఎస్ పార్టీ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. వరంగల్ సభకు లక్షలాదిగా వచ్చిన ప్రజలకు చెప్పిన సందేశం ఇదేనని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దేశ రాజకీయ చరిత్రలో అతి పెద్ద సభల్లో ఒకటిగా నిలిచిపోతుందని ప్రశంసించారు. వరంగల్ బిఆర్‌ఎస్ సభ అనేది రజతోత్సవ కార్యక్రమాలకు ప్రారంభం మాత్రమేనని, ఇకపై తానే ముందుండి పోరాడుతానని కెసిఆర్ ప్రకటించారని, భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని బిఆర్‌ఎస్ శ్రేణులకు కెటిఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని, ఇకపై ప్రతి అంశంలో ప్రభుత్వాన్ని వెంటాడుతామని కెటిఆర్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆరాచకాలను మరింతగా ఎండగడతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News