Wednesday, January 22, 2025

మద్యం కేసు మళ్లించేందుకు బిఆర్‌ఎస్ మహిళా ఉద్యమం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మద్యం కేసు నుంచి దృష్టిని మళ్లించేందుకు మహిళా బిల్లుపై బిఆర్‌ఎస్ పోరాటం చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్‌ఎస్‌కు లేదన్నారు. అన్ని కీలక పదవుల్లో మహిళలకు బిజెపి స్థానం కల్పించిందన్నారు. 33 శాతం రిజర్వేషన్ ముందు మీరు అమలు చేయాలని బిఆర్‌ఎస్‌కు కిషన్‌రెడ్డి సూచించారు. తప్పు లేకుండా ఈడి ఎవరినీ ప్రశ్నించదు. మద్యం వ్యాపారం చేసింది మీరు.. డబ్బులు తీసుకుంది మీరు అని ఆయన విమర్శించారు.

తీగ లాగితే డొంక కదిలినట్టు.. ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చారు. ఎవరు తప్పుచేసినా వదలకూడదనే లక్ష్యం బిజెపిదన్నారు. సంగీత నాటక విభాగాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నాం. దానికి భూమి కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం స్థలాల్ని కోరాం. ఎంఎంటిఎస్ రెండోదశ పూర్తి చేద్దామని లేఖ రాశా.. ఘటేకేసర్ నుంచి యాదగిరిగుట్ట ఎంఎంటిఎస్ వరకు పొడిగించేందుకు లేఖ రాశానని వెల్లడించారు.. మెట్రో అఫ్జల్‌గంంజ్ నుంచి ఫలక్ నుమా వరకు పెంచుదాం అని లేఖ రాశా.. ఇలా దేనికీ సిఎం కెసిఆర్ నుంచి సమాధానం లేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపి..
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని గెలిపించినందుకు ఉపాధ్యాయులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో ఎవిఎన్ రెడ్డికి అన్నివర్గా ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా నిలిచాయి. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బిజెపి అని ప్రజలు నమ్ముతున్నారనే విశ్వాసం.. స్పష్టంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా టెక్స్ టైల్ రంగంలో దేశాన్ని ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో నిలపాలనే సంకల్పంతో పిఎం మిత్ర ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

10 వేల కోట్ల రూపాయల పెట్టబడులు వచ్చేలా కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. దీనివల్ల లక్షల మందికి నేరుగా.. రెండు లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. టెక్స్‌టైల్ పార్కులో కాటన్ తీసుకువెళ్తే.. క్లాత్ బయటకు వస్తుంది. దీని వల్ల అనేక లాభాలు కలుగుతాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News