మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎవరికి ఓటు వేసినా ’గెలుపు నాదే’ అంటూ నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్ లీగల్ సెల్ నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం బిఆర్కే భవన్‌లో సిఈఓ వికాస్‌రాజ్ తో వారు సమావేశం అయ్యారు. ఎంపి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై లీగల్ సెల్ నేతలు సోమభరత్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, పలువురు అడ్వకేట్స్ ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ లీగల్ సెల్, జనరల్ సెక్రటరీ సోమ భరత్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి నేతలు దొంగ దారులు వెతుక్కుంటున్నారు. ఈవిఎంలో ఏ గుర్తుకి ఓటు వేసిన గెలిచేది నేను అని అర్వింద్ వ్యాఖ్యలు చేశారు.. ఏ బటన్ నొక్కిన బిజెపికే పడుతుందని మనసులో మాట బయటపెట్టారు అని ఆయన ఆరోపించారు. బిజెపి అప్రజాస్వామీకంపై మాట్లాడితే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అని మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని సిఈఓను కోరాం.. ఎంపి అరవింద్ పై చర్యలు తీసుకోవాలని కోరామని భరత్ వెల్లడించారు. బిజెపి నాయకులపై న్యాయబద్ధంగా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై తప్పుడు భావన ఉంటుందని ఆయన వెల్లడించారు.