మనతెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం తో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది.అందులో భాగంగా బుధవారం చేవెళ్ల, వరంగల్, జహీరాబాద్, నిజామాబా ద్ పార్లమెంట్ స్థానాల్లో బిఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను అధినేత కెసిఆర్ ప్రకటించారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ పా ర్లమెంటు నుంచి బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య,జహీరాబాద్ స్థానానికి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్లను అధినేత కెసిఆర్ ఖరారు చేశారు. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను ఇప్పటికే పలువురు అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా నాలుగు లోక్‌సభ స్థానాలను అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటి వరకు తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రకటించారు. తనకు జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ నుంచి అవకాశం ఇచ్చినందుకు గాలి అనిల్‌కుమార్ బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తొమ్మిది మంది బిఆర్‌ఎస్ అభ్యర్థులు వీరే..
1)ఖమ్మం : -నామా నాగేశ్వర్ రావు
2) మహబూబాబాద్ -(ఎస్.టి) : మాలోత్ కవిత
3) కరీంనగర్ -: బోయినిపల్లి వినోద్ కుమార్
4 )పెద్దపల్లి(ఎస్.సి) -: కొప్పుల ఈశ్వర్
5 )మహబూబ్‌నగర్ -:మన్నె శ్రీనివాస్ రెడ్డి
6)చేవెళ్ల -: కాసాని జ్ఞానేశ్వర్
7)వరంగల్ (ఎస్.సి)-: డాక్టర్ కడియం కావ్య
8 )జహీరాబాద్ : -గాలి అనిల్ కుమార్
9) నిజామాబాద్ :- బాజిరెడ్డి గోవర్ధన్