హైదరాబాద్ : మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీ తొలి విజయం నమోదు చేసింది. ఔరంగాబాద్ జిల్లా గంగాపూర్ తాలుకాలోని అంబెలోహల్ గ్రామ వార్డు సభ్యుడిగా బిఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి గఫూర్ సర్దార్ పఠాన్ విజయం సాధించారు. మహారాష్ట్రలో వార్డు సభ్యుడి గెలుపుతో గులాబీ శ్రేణులకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఛత్రపతి శంభాజీనగర్ గంగాపూర్ తాలూకాలోని అంబేలోహల్ గ్రామంలో గురువారం (మే 18) జరిగిన గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి.
Also Read: కాంగ్రెస్ పార్టీ ముఖ్యులపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
కాగా.. బిఆర్‌ఎస్ అభ్యర్థి గఫర్ సర్దార్ పఠాన్.. ప్రత్యర్థిపై 115 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మొదటగా మహారాష్ట్రపై దృష్టి సారించింది.గ కొంతకాలంగ మహారాష్ట్ర నుంచి బిఆర్‌ఎస్‌లోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. మరాఠా గడ్డపై గులాబీ బాస్ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.భవిష్యత్తులో మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీ మరింత బలోపేతం చేసి, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు పార్టీ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.