Wednesday, January 29, 2025

సీతక్కకు దీటుగా బిఆర్‌ఎస్ స్కెచ్

- Advertisement -
- Advertisement -

వరంగల్  : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు నియోజకవర్గ ఎన్నికల ప్రచారం హాట్ హాట్‌గా నడుస్తున్నది. ఇక్కడినుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మె ల్యే సీతక్కను ఎదుర్కొనేందుకు బిఆర్‌ఎస్ పకడ్బందీ ప్లాన్ తో ముందుకుపోతున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేసులో ఆమె ప్రచారంలోకి రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం అభ్యర్థిగా ఉన్న సీతక్క…రాష్ట్రమంతా తిరగకుండా కట్టడి చేయడంలో బిఆర్‌ఎస్ సఫలీకృతం అయింది. బిఆర్‌ఎస్ స్పీడ్ పెంచడంతో సీతక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్‌ఎస్ లోకి వలసలు పెరగడంతో బిఆర్‌ఎస్ జోష్ లో ఉంటే..కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఇక్కడినుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క, బిఆర్‌ఎస్ అభ్యర్థిగా జెడ్పీ ఇంచార్జి చైర్ పర్సన్‌గా ఉన్న బడే నాగజ్యోతి, బిజెపి అభ్యర్థిగా మార్కె ట్ మాజీ చైర్మన్, మాజీమంత్రి చందూలాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ పోటీచేస్తున్నారు.

బిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖరారైనప్పటి నుంచి నాగజ్యోతి పల్లెల్లో ప్రజలను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. పార్టీకి కేడర్ ఉన్నప్పటికీ సమన్వయం లేకపోవడంతో తొలినాళ్లలో కొంత సమస్య ఎదురైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జిలను నియమించింది. అందులోభాగంగా వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ములుగుకు నియమించింది. వెంటనే రంగంలోకి దిగిన ఆయన పార్టీని చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. తొలుత ములుగు నియోజకవర్గ పరిధిలో ఉన్న తొమ్మిది మండలాలకు సమన్వయకర్తలను నియమించారు. ములుగు, కొత్తగూడ, గంగారం మండలాల బాధ్యతలను రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డికి అప్పగించారు. వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల బాధ్యతలు జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావుకు ఇచ్చారు. ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల బాధ్యతలను రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌కు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News