Wednesday, January 22, 2025

కళ్ల ముందే కలెక్టరేట్లు!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలన్నా, అధికారుల ను కలవాలన్నా, విన్నపాలు ఇవ్వాలన్నా, తమ స మస్యలను పరిష్కరించమని వేడుకోవాలన్నా ఎం తో గగనమైన దుర్భర పరిస్థితుల నుంచి సొంత ఊరుదాటకుండానే తమ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రభుత్వ పాలన సాగుతుండడం వంటి గొప్ప మార్పును తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. ఇలాంటి గుణాత్మక మార్పుల వల్లనే బిఆర్‌ఎస్ పార్టీని ముచ్చటగా మూడోసారి అధికారం వరించబోతోందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్య క్తం చేస్తున్నారు. 2014వ సంవత్సరానికి ముందు గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా, రెవెన్యూ డివిజన్‌లు, చివరకు మండల కేం ద్రాలకు వెళ్లాలన్నా వందలాది కిలోమీటర్ల దూరా న్ని ప్రయాణించడమే కాకుండా ప్రతి చిన్న పనికీ రెండు, మూడు రోజుల సమయం పడుతుండటం తో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాలనే ఆలోచనలనే విరమించుకొన్న దయనీయ పరిస్థితులు,

ఎన్నో చేదు అనుభవాలను చవిచూసిన తెలంగాణ ప్రజలు నేడు కళ్లముందే ప్రభుత్వ కార్యాలయాలు కనిపిస్తుండటం, మండల కేంద్రమైనా, రెవెన్యూ డి విజన్‌లో పనులైనా చివరకు కలెక్టరేట్‌లో పనులు ఉన్నా ఉదయాన్నే వెళ్లి పనులు ముగించుకొని సా యంత్రానికి ఇంటికి చేరుకునేటంతటి సౌకర్యవంతంగా పరిస్థితులు మారిపోవడంతో ప్రజలు సం తోషంగా జీవిస్తున్నారు. బిఆర్‌ఎస్ అభివృద్ధికి ఇది నిలువెత్తు నిదర్శమని ఆ పార్టీ నేతలు పే ర్కొంటున్నారు. ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకొచ్చిన సమూల మార్పులు, అధికార వికేంద్రీకరణ, పరిపాలనా వి కేంద్రీకరణ, పాలనాపరమైన సంస్కరణలే బిఆర్‌ఎస్ పార్టీ కొండంత అండగా ఉంటాయని ధీమా గా చెబుతున్నారు. 2014 జూన్ నెలకు ముందున్న ప్రభుత్వాల పాలనలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలు తమతమ సమస్యల పరిష్కారం కోసం జిల్లాల్లోని కలెక్టరేట్‌ల చుట్టూ, హైదరాబాద్‌లోని హెచ్‌ఓడి కార్యాలయాల చుట్టూ, అదీ చాలక చివరకు సచివాలయం ప్రధాన గేట్ల దగ్గర రోజుల తరబడి పడిగాపులు పడిన దుర్భర పరిస్థితులు నేడు లేవని వివరించారు. పాలనా సంస్కరణల్లో భాగంగానే జిల్లాల విభజన, రెవెన్యూ డివిజన్ల విభజన, మండలాలు,

తాండాలను గ్రామ పంచాయితీలుగా చేస్తూ తీసుకొన్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చాయని, వాటి ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారని వివరించారు. గతంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టరేట్‌కు మంచిర్యాల ప్రాంతం నుంచి ఎవ్వరైనా వెళ్ళి కలెక్టర్‌కు ఒక ధరఖాస్తు ఇవ్వాలన్నా, తిరిగి తన సొంత గూటికి చేరాలన్నా మూడు రోజుల సమయం పట్టేది. అదే విధంగా తాండూరు, వికారాబాద్ ప్రాంతాల్లోని జనం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలవాలన్నా రోజుల సమయం పట్టేది. ఇలా ఎన్నో ఉమ్మడి జిల్లాల్లోని ప్రజలు తమతమ సమస్యలను పరిష్కరించుకోలేక వదిలేసిన అంశాలు కొన్ని లక్షల్లో ఉన్నాయని వివరించారు. అలాంటి దయనీయ పరిస్థితులకు ఫుల్‌స్టాప్ పెట్టాలని, ఒక జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చి తిరిగి ఇంటికి రావడానికి ఒకే ఒక్క రోజు సమయం సరిపోయే విధంగా మార్పులు చేసినట్లుగా తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో తెలంగాణలో 10 జిల్లాలుంటే స్వరాష్ట్ర పాలనలో అవి 33 జిల్లాలకు విభజన జరిగిందని వివరించారు. 2016 అక్టోబర్‌కు ముందు తెలంగాణలోని 10 జిల్లాల్లో ఒక్కో జిల్లాలో సగటున 35 లక్షలకు పైగా జనాభా ఉండేదని, దీని వల్ల పరిపాలన కష్టతరమయ్యేదని, కొన్ని చోట్ల జిల్లా కేంద్రాలకు,

ఇతర కార్యాలయాలకు వెళ్ళాలంటే 200 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల దూరం ఉండేవని వివరించారు. దీంతో జిల్లా కేంద్రాల అధికారులు గ్రామాలకు పోవాలన్నా, గ్రామాల్లోని ప్రజలు జిల్లా కేంద్రాలకు పోవాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదర్కొనే వారు. అంతేగాక సగటున ప్రతి జిల్లాలో సుమారు 10 లక్షల కుటుంబాలు ఉండేవని, దాంతో ఏ కుటుంబం ఆర్ధిక పరిస్థితి ఏమిటో జిల్లాల అధికారులకు తెలుసుకోవడం కష్టమయ్యేదని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కష్టమయ్యేదని తెలిపారు. ఈ సమస్యలను అధిగమించడానికే జిల్లాల పునర్వవస్థీకరణ చట్టం-1974 ప్రకారం తెలంగాణలో మరో 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి జిల్లాల సంఖ్యను 33 వరకూ పెంచిందని, కొత్త జిల్లాలను అక్టోబర్ 11వ తేదీన ప్రారంభించామని, దీంతో చిన్న పరిపాలనా విభాగాలతో సమర్దవంతమైన పాలన చేయడానికి ఆస్కారమేర్పడిందని వివరించారు. జిల్లాలతో పాటుగా రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాలు, గ్రామ పంచాయితీల సంఖ్యను కూడా పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా పెంచాల్సి వచ్చింది. ఇక పట్టణాలు, కార్పోరేషన్ల సంఖ్యను కూడా ప్రజల అవసరాల రీత్యా పెంచుకోవాల్సి వచ్చిందని తెలిపారు. కేవలం 43 ఉన్న రెవెన్యూ డివిజన్లకు అదనంగా

36 కొత్తగా ఏర్పాటు చేయడంతో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 77కు పెంచుకోవాల్సి వచ్చిందని తెలిపారు. 459 మండలాలను విభజించి కొత్తగా మరో 162 మండలాలను ఏర్పాటు చేశామని, దాంతో మండలాల సంఖ్య ప్రస్తుతం 621కు పెరిగాయని, ఇంకా పెరుగుతూనే ఉన్నాయని వివరించారు. తెలంగాణలో 7,855 గ్రామ పంచాయితీలుండగా కొత్తగా 4914 గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసుకోవడంతో ప్రస్తుతం రికార్డుస్థాయిలో 12,769కి గ్రామ పంచాయితీల సంఖ్య పెరిగిందని వివరించారు. అదే విధంగా మున్సిపాలిటీల సంఖ్య కేవలం 68 మాత్రమే ఉండగా మరో 74 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంతో ఆ సంఖ్య 142కు పెరిగిందని, అదే విధంగా ఆరు మున్సిపల్ కార్పోరేషన్లకు అదనంగా మరో ఏడు కార్పోరేషన్లను ఏర్పాటు చేయడంతో ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం 13 మున్సిపల్ కార్పోరేషన్లు అయ్యాయని వివరించారు. ఇలా ప్రజల వద్దకు అన్నిరకాల ప్రభుత్వ కార్యాలయాలు వెళ్ళడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వాహనాలు పెద్ద సంఖ్యలో తిరుగుతుండటం, మునుపెన్నడూ చూడని ఆఫీసర్లు గ్రామాలకు వస్తూండటంతోనే ఎక్కడికక్కడనే

తమ సమస్యలు పరిష్కారమవుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారని ఆ నేతలు వివరించారు. పైగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేసే క్రమంలో ఆయా జిల్లాలకు సంబంధించిన సమస్త అధికారాలన్నీ కలెక్టర్లకే కట్టబెట్టడంతో 80శాతం ప్రజా సమస్యలన్నీ ఆ జిల్లాల్లోనే పరిష్కారం అవుతున్నాయని వివరించారు. ప్రతి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకూ హైదరాబాద్‌లోని సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే పాత పద్దతులకు చరమగీతం పాడినట్లయ్యిందని వివరించారు. కేవలం విధాన పరమైన నిర్ణయాలు, ఆయా అభివృద్ధి-సంక్షేమ పథకాల విధివిధానాలు, మార్గదర్శకాలు, నిధులను విడుదల చేసే అధికారాలు మాత్రమే హైదరాబాద్‌లోని సచివాలయానికి పరిమితంగా ఉన్నాయని, అందుకే తమ సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్‌కు వచ్చే సామాన్య ప్రజల తాకిడి తగ్గిందని వివరించారు. ఈ మార్పులే ప్రజలకు బిఆర్‌ఎస్ పార్టీ పాలనపై అచంచల విశ్వాసం, నమ్మకం ఏర్పడేలా చేశాయని నేతలు అంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News