Thursday, January 23, 2025

గత పాలకులు చేయలేని అభివృద్ధి బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసింది

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:గత పాలకులు చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందని దేవరకొండ శాసనసభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలోని రైతు వేదిక భవనంలో జరిగిన రైతుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అంటున్న రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మూడు పంటలు పండించే బిఆర్‌ఎస్ పార్టీ కావాలో, మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలో రైతులే నిర్ణయించుకోవాలని పే ర్కొన్నారు. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.రైతులకు ఉచితంగా 24 గంటల కరె ంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మళ్లీ రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంపైన సమగ్ర అవగాహన కలిగిన వ్యక్తి ఒక్క కేసీఆర్ మాత్రమేనని, ఆయన నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సలహాదారుడు మారుపాకుల అరుణసురేష్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైస్‌ఎంపీ పీ చింతపల్లి సుభాష్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు టివిఎన్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు నేనావత్ శ్రీను, బిఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, ఎంపిటిసి జూలూరు ఉత్తరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News